విరాళాల లెక్కలు చూపని పార్టీలు

దేశంలోని అన్ని రాజకీయ పార్టీలదీ అదే తీరు… వీరెక్కువ వారు తక్కువ అనికాదు అందరూ అందరే… రాజకీయ పార్టీలు తమ పార్టీ అవసరాల కోసం వివిధ కార్యక్రమాలను నిర్వహించడం కోసం ప్రజల నుండి వ్యాపారుల నుండి, పారిశ్రామిక సంస్థల నుండి విరాళాలు సేకరిస్తూ ఉంటాయి. అయితే పార్టీలు తమ విరాళాలకు సంబంధించిన లెక్కలను సక్రమంగా బయటపెట్టడం లేదు. ఇందులో ఏ పార్టీకీ మినహాయింపు లేదు. 2004-05 నుండి 2014-15 వరకు వివిధ పార్టీలకు సంబంధించిన నిధుల విషయంలో పార్టీలు విరాళాలు ఇచ్చిన వారి పేర్లను బహిర్గతం చేయడం లేదు. పార్టీలకు విరాళాలు ఇచ్చిన వారిలో 20 వేలకు తక్కువ విరాళాలకు సంబంధించి లెక్కలు చెప్పాల్సిన అవసరం లేకపోవడం పార్టీలకు కలిసివచ్చింది. దీన్ని అడ్డంపెట్టుకుని విరాళాల్లో ఎక్కువ శాతాన్ని అజ్ఞత విరాళాల కింద నమోదు చేస్తున్నాయి. 2004 నుండి 2015 ల మధ్య వివిధ పార్టీల విరాళాలపై ఒక సంస్థ తయారు చేసిన నివేదికలో ఆశ్చర్యకర విషయాలు వెల్లడయ్యాయి.

  • 6800 కోట్ల రూపాయల అజ్ఞత విరాళాలు ఉన్నట్టు గుర్తింపు
  • 2004 2015 మధ్య అధికారంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన 4వేల కోట్లలో 83 శాతం అజ్ఞాత వ్యక్తుల నుండి వచ్చినవే.
  • బీజేపీ కూడా తక్కువేమీ తినలేదు ఈ పార్టీకి వచ్చిన 3200 కోట్లలో 65 శాతం పేర్లు వెల్లడికాని వారి వద్ద నుండి వచ్చినవే.
  • 2004 నుండి 2015 వరకు దేశంలోని రాజకీయ పార్టీలకు అన్నింటికీ కలిపి దాదాపు 11 వేల కోట్ల రూపాయల విరాళాలు అందాయి.
  • కమ్యూనిష్టులు, ఆప్ పార్టీలదీ ఇదే దారి అయితే గుప్త విరాళాల శాతం కాస్త మెరుగ్గా 53 శాతంగా ఉంది.
  • ఒక్క దాత పేరు వెల్లడించని పార్టీ బీఎస్పీ ఈ పార్టీ అన్ని విరాళాలు 20వేలకు తక్కువ ఇచ్చినట్టుగా నమోదు చేసింది.
  • బాధ్యతాయుతంగా పార్టీలు ఈ విధంగా ప్రవర్తించడం పై విమర్శలు వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *