గణతంత్ర్య దినోత్సవం అంటే ఏమిటి… ఈ ప్రశ్నకు బదులు చెప్పలేక చాలా మంది తెల్ల మొహాలు వేస్తున్నారు. మరికొంత మందికి స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి తేడా తెలియడం లేదు. ఈ స్వచ్చంధ సంస్థ చేసిన సర్వే ప్రకారం నూటికి 65 శాతానికి పైగా ప్రజలకు గణంత్ర దినోత్సవం అంటే ఏమిటో తెలియదట. వీరిలో చదువుకున్న వారే ఎక్కువ ఉండడం విశేషం. గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలు అనే తేడా లేకుండా గణతంత్ర దినోత్సవం గురించి తెలియని వారు చాలా మందే ఉన్నారు.
- గణతంత్ర దినోత్సం అంటే తెలియని వారిలో చదువుకున్న వాళ్లే ఎక్కువ
- ఉద్యోగస్తులకు కూడా గణ తంత్ర దినోత్సవం అంటే ఏమిటో తెలియదు
- గణతంత్ర దినోత్సవానికి స్వాతంత్ర్య దినోత్సవానికి తేడా తెలీనీ వారు నూటికి 70 శాతం ఉన్నారు.
- జనవరి 26న మనకి స్వాతంత్ర్యం వచ్చిందని కొందరంటే మరికొందరు గాంధీ జయంతి అనడం కొసమెరుపు.
- మన జాతీయ గీతాన్ని పూర్తిగా పాడలేని వారు చాలా మందే ఉన్నారు.
- జాతీయ గీతం ఏమిటో కూడా తెలియని వారు కూడా ఉన్నారు.
- రిపబ్లిక్ డే ను హాలిడేగా ఫీల్ అవుతున్న వారే ఎక్కువ.
- జనవరి 26న హాలీడే అని తెలిసిన వారు 99 శాతం మంది ఉన్నారు.
-
భారత్ 1950 జనవరి 26న రిపబ్లిక్ గా మారింది. ఆ రోజు నుండి మన రాజ్యాగం అమల్లోకి రావడంతో పాటుగా ప్రధమ రాష్ట్రపతిగా బాబు రాజేంద్రప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. మనకు స్వాతంత్ర్యం వచ్చిన ఆగస్టు 15 1947 నుండి జనవరి 26 1950 వరకు మనకు స్వంత రాజ్యాంగం లేదు. రాష్ట్రపతి కూడా లేరు.