ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున తనయుడు హీరో అక్కినేని నాగ చైతన్య ప్రముఖ హీరోయిన సమంతను వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. వీరి ఎంగేజ్ మెంట్ జనవరి 29న జరగబోతోంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయినట్టు సమాచారం. ఈ ఎంగేజ్ మెంట్ కోసం సెలబ్రెటీలను ఆహ్వానించడం పూర్తి చేసిన అక్కినేని కుటుంబం ఎంగేజ్ మెంట్ ఏర్పాట్లలో బిజీబిజీగా ఉంది. నాగుర్జున మరో కుమారుడు అక్కినేని అఖిల్ ఎంగెజ్ మెంట్ పూర్తయింది. పారిశ్రామిక వేత్త జీవీకే కుటుంబానికి చెందిన శ్రియా భూపాల్ ను అఖిల్ పెళ్లిచేసుకోబోతున్నాడు వీరి పెళ్లి ఇటలీలో జరగున్నట్టు సమాచారం.