సూపర్ స్టార్ మహష్ బాబుకు నాంపల్లి కోర్టు సమన్లు జారీచేసింది. మహేష్ బాబుతో పాటుగా శ్రీమంతుడు చిత్ర నిర్మాత, దర్శకులు ఎర్నేని నవీన్, కొరటాల శిలకు కూడా కోర్టు సమన్లను జారీచేసింది. శ్రీమంతుడు సినిమా కథకు సంబంధించిన వివాదంలో కోర్టు ఈ సమన్లను పంపింది. తాను రచించిన “చచ్చేంత ప్రేమ” అనే కథ ఆధారంగా శ్రీమంతుడు సినిమా తీశారని దీనికి తన అనుమతి తీసుకోలది అంటూ శరత్ చంద్ర అనే రచయిత నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. 2012లో తాను రాసిన ఈ కథ వారపత్రికలో కూడా వచ్చిందని పేర్కొంటూ ఆయన కోర్టులో కేసు వేశాడు. దీనితో కోర్టు వీరికి సమన్లను జారీ చేసింది. కాపీ రైట్ చట్టాన్ని ఉల్లంఘించారని ఆరోపిస్తూ శరత్ ఈ కేసును వేశారు. ఫిర్యాదును విచారణకు తీసుకున్న కోర్టు వీరిని హాజరుకవాల్సిందిగా సమన్లను జారీచేసింది.