పాక్ అణు స్థావరాలపై దాడికి భారత్ యత్నం…

పాకిస్థాన్ అణు స్థావరాలను ద్వంసం చేసేందుకు భారత్ 1981లో ప్రయత్నించిందని అమెరికా నిఘా సంస్థ సీఐఏ వర్గాలు వెల్లడించాయి. పాకిస్థాన్  అణు స్థావరం పై దాడిచేసేందుకు భారత్ చేసిన ప్రయత్నం తృటిలో తప్పిపోయిందని ఆవర్గాలు పేర్కొన్నాయి. పాకిస్థాన్ మన దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆ సమయంలో ప్రారంభించింది. పంజాబ్ లో వేర్పాటు వాదు ఉధ్యమానికి పాకిస్థాన్ పూర్తిసహకారాన్ని అందచేస్తూ వచ్చింది. ఈ క్రమంలో భారత్ పాకిస్థాన్ కు గట్టిగు బుద్దిచెప్పాలని నిర్ణయించుకుందని సీఐఏ నాటి పరిస్థితులను వివరించింది. అప్పుడు ప్రధానిగా ఉన్న ఇందిరా గాంధీ పాకిస్థాన్ కు బుద్దిచెప్పాలనే నిర్ణయంతో పాకిస్థాన్ అణస్తావరాలు ఉన్న కహుతా పై దాడులు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు. పాక్ స్థావరాలపై దాడులు చేయాలని నాటి ప్రధాని సైనిక దళాలను అదేశించడంతో భారత్ వైమానిక దాణులకు సిద్ధం అయింది.  అంతకు ముందు ఇరాక్ అణస్థావరాలపై ఇజ్రాయిల్ చేపట్టిన దాడుల తరహాలోనే దాడిచేయాలనేది భారత్ వ్యూహం భారత్ కు ఈ దాడుల్లో సహకరించేందుకు ఇజ్రాయిల్ కూడా ముందుకు వచ్చిందని సీఐఏ వెల్లడించింది.
indira-gandhi
భారత్ వైమానిక దాడుల సన్నాహాలను పసిగట్టిన సీఐఏ ఈ విషయాన్ని నాటి అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ కు సమాచారం ఇవ్వడంతో రీగన్ నాటి పాకిస్థాన్ అధినేత జనరల్ జియాఉల్ హక్ ను అప్రమత్తం చేయడంతో భారత్ తన ప్రయత్నాలపై వెనక్కితగ్గిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అప్పుడు భారత్ గనుక పాకిస్థాన్ అణుస్థావరాలపై దాడిచేసి ఉంటే పాక్ కోలుకోవడానికి చాలా సమయం పట్టేదని ఈ దాడులతో పూర్తిస్థాయి యుద్ధం వచ్చినా ఎదుర్కొనేందుకు భారత్ అప్పుడు సిద్ధం అయిందని ఆ వర్గాలు చెప్పాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *