ఓవైసీ "దంగల్" ప్లెక్సీలు కలకలం

యూపీ కా దంగల్ పేరుతో పాతబస్తీలో వెలసిన కొన్ని ప్లెక్సీలు సంచలనం రేపాయి. ఇటీవల విడుదల అయిన దంగల్ సినిమా పోస్టర్లను మార్ఫ్ చేసి అమీర్ ఖాన్ స్థానంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీని ఉంచుతూ ఆయన పక్కన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతిలతో కూడిన భారీ పోస్టర్లు హైదరాబాద్ పాతబస్తీలో వెలిశాయి. అఫ్జల్ గంజ్, మదీనా ప్రాంతాల్లో భారీ సైజులు ఏర్పాటు చేసిన ఈ ప్లెక్సీలు చర్చనీయాంశమయ్యాయి.  ఈ ప్లెక్సీలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ బీజేపీ యూవమోర్చా పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అసదుద్దీన్ దంగల్ ప్లెక్సీలు పోలీసులు జీహెచ్ ఎంసీ సాహాయంతో తొలగించారు. వీటిపై ఫిర్యాదులు రావడంతో తొలగించినట్టు తెలుస్తోంది. మరో వైపు ఈ పోస్టర్లకు తమ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ఎంఐఎం పార్టీ స్పష్టం చేసింది. ఉత్తర్ ప్రదేశ్ కు సంబంధించి ఇక్కడ పోస్టర్లను పెట్టాల్సిన అవసరం తమకు లేదని అయినా అవి ఎవరు ఏర్పాటు చేశారో కూడా తమకు తెలియదని ఆ పార్టీ స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *