జల్లికట్టు కోసం మెరినా బీచ్ లో జరిగిన ఆందోళనలు అదుపుతప్పిన సందర్భంగాలో ఆందోళనకారలు వాహనాలను ద్వంసం చేశారు. దాదాపు 50కి పైగా వాహనాలు ద్వంసం అయ్యాయి. అయితే పోలీసులే స్వయంగా వాహనాలను ద్వంసం చేసినట్టు కనిపిస్తున్న ఒక వీడియో, మహిళలను పోలీసులు దాడిసేసి ద్విచక్ర వాహనాలను ద్వంసం చేసినట్టు కనిపిస్తున్న మరో వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. దీనితో ఈ రెండు వీడియోలపై దర్యాప్తు చేస్తున్నట్టు చెన్నై పోలీసు అధికారులు ప్రకటించారు. తొలుత ఈ వీడియో అసలుదికాదని దాన్ని మార్ఫింగ్ చేసినట్టు చెప్పిన పోలీసు ఉన్నతాధికారులు తాజాగా ఆ వీడియోలపై దర్యాప్తు చేస్తామని ప్రకటించారు. ఒకవేళ పోలీసుల తప్పు ఉన్నట్టు తేలితే దానిపై విచారణ జరుపుతామని చెప్తున్నారు.
పోలీసులే అరాచకాలకు పాల్పడినట్టు చెప్తున్న రెండు వీడియోలు ఇప్పుడు తమిళనాడులో వైరల్ గా మారాయి. ఈ వీడియోలు పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో పోలీసులు ఆత్మరక్షణలో పడినట్టు కనిపిస్తోంది.