సమాజ్ వాదీ పార్టీలో తండ్రీ, కొడుకుల మధ్య విభేదాలకు ప్రాధాన కారణం గా చెప్పుకుంటున్న సమాజ్ వాదీ నేత అమర్ సింగ్ తాజాగా అమితాబ్ కుటుంబ విషయాలను రచ్చచేశాడు. ఎప్పుడూ సినితారలు, పారిశ్రామికవేత్తలు, సెలబ్రెటీలతో కనిపించే రాజకీయవేత్త అమర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సమాజ్ వాదీ పార్టీలో విభేదాలకు తానే కారణం అంటూ వస్తున్న వార్తలపై స్పందించిన అమర్ సింగ్ కొత్త వివాదానికి తెరతీశాడు. అబితాబ్ కుటుంబంలో అత్తా కోడళ్లు అయిన జయాబచ్చన్, ఐశ్వర్యారాయ్ లకు పడడంలేదని వారిద్దరి మధ్య విభేదాలకు కూడా తానే కారణమా అంటూ కొత్త విషయాన్ని చెప్పాడు. జయ-ఐశ్వర్యల మధ్య వివాదం వల్ల అమితాబ్ -జయబచ్చన్ మధ్య కూడా వేభేదాలు వచ్చాయని వారిద్దరు ఇప్పుడు ఒక ఇంట్లో ఉండడంలేదని చెప్పి కుటుంబ విషయాలు రచ్చచేశాడు.
ప్రతీ వివాదానికి తానే కారణంగా మీడియా చూపుతోందని ఇప్పుడు వీరి మధ్య గొడవలకు కూడా తానే కారణం అంటూ మీడియాలో వార్తలు వస్తాయేమో అంటూ అమర్ సింగ్ అన్నారు. అమర్ సింగ్ వ్యూహాత్మకంగానే అబితాబ్ ఇంటి విషయాలను రచ్చచేశాడని భావిస్తున్నారు. అబితాబ్ కుటుంబంతో చాలాకాలం పాటు సన్నిహితంగా మెలిగిన అమర్ సింగ్ ను అబితాబ్ దూరంగా ఉంచారు. దీనికి సంబంధించిన కారణాలు బయటకు వెల్లడికాకున్నప్పటికీ అమర్ సింగ్ ను అమితాబ్ దూరం పెట్టిన తరువాత వారి కుటుంబ వ్యవహారను అమర్ సింగ్ రచ్చ చేయడం గమనార్హం.
ములాయం సింగ్ కు అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన అమర్ సింగ్ సమాజ్ వాదీ పార్టీలో చక్రం తిప్పాడు. అయితే ములాయంసింగ్ యాదవ్ అమర్ సింగ్ ను పార్టీ నుండి సస్పెండ్ చేశాడు. కుమారుడు అఖిలేష్ యాదవ్ ఒత్తిడి మేరకే అమర్ సింగ్ ను పార్టీ నుండి బయటకు పంపిరానే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత తిరిగి అమర్ సింగ్ సొతంగూటికి చేరుకున్నారు. అయితే అమర్ తిరిగి పార్టీలోకి రావడం ఇష్టం లేని అఖిలేష్ అప్పటి నుండి తండ్రితో విభేదిస్తున్నడని వీరి మధ్య విభేదాలను అమర్ సింగ్ మరింత పెంచారనే విమర్శలు ఉన్నాయి.