ప్రియాంక పార్టీని గట్టెక్కించగలరా!

దేశవ్యాప్తంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న కాంగ్రెస్ కు రాజీవ్-సోనియా ల కూతురు ప్రియాంక గాంధీ తిరిగి జీవం పోయగలరా? కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ఇదే ఆశతో ముందుకు సాగుతోంది. ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ద్వారా తమ పార్టీ పరిస్థితి మెరుగుపడుతుందని వారు ఆశిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రాభవం రోజురోజుకీ తగ్గిపోతోంది. దేశాన్ని దశాబ్దాలపాటు ఏలిన కాంగ్రెస్ కు రోజురోజుకూ ఆదరణ తగ్గడంతో పార్టీ మనుగడే ప్రశ్నర్థంకంగా మారింది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నామమాత్రపు పాత్రను పోషిస్తోంది. మరోవైపు బలమైన మీడీ నాయకత్వంలో బీజేపీ దూసుకుని పోతుండడంతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా మారింది. ఈ పరిస్థితుల్లో ప్రియాంక గాంధీ పార్టీని గట్టెకించగలరని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. నెహ్రు కుటుంబం మినహా కాంగ్రెస్ పార్టీలో ఇంకో నేతను ఊహించుకునే పరిస్థితి కనిపించని నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ప్రియాంక పెద్ద దిక్కయ్యారు.
priyanka gandhi2 priyanka gandhi1
ఆరోగ్య సమస్యలతో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పార్టీ క్రియాశీల కార్యకలాపాల్లో పెద్దగా పాల్పంచుకోవడం లేదు. ఇటు రాహుల్ గాంధీ పార్టీని గట్టెక్కిస్తారనే ఆశ కూడా తగ్గిపోయిన నేపధ్యంలో ప్రియాంక ఒక్కరే కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు నింపగలరే నమ్మకంలో పార్టీ కార్యకర్తలున్నారు. ప్రియాంక  క్రియాశీల రాజకీయాల్లోకి వస్తారంటూ గతంలో చాలా సార్లు ప్రచారం జరిగినా ఆమె కేవలం తమ కుటుంబ నియోజకవర్గాలు ఆమేధీ, రాయ్ బరేలీ ప్రాంతాల్లోనే ప్రచారానికి పరిమితం అయ్యారు.
నాయనమ్మ ఇందిరాగాంధీ పోలికలు పుష్కలంగా ఉన్న ప్రియాంక గాంధీ మంచి వాక్పటిమ ఉన్న వ్యక్తిగా పేరుంది. ఆకట్టుకునే రూపంతో పాటుగా వక్తగా, రాజకీయ వ్యూహాల్లో ముందుండే ప్రియాంకను బరిలోకి నింపడం ద్వారా లాభం పొందాలని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీతో పొత్తుపెట్టుకునే విషయంలో ప్రియాంక క్రియాశీలంగా వ్యవహరించారు. పొత్తును పట్టాలు ఎక్కిండంతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి గౌరవ ప్రదమైన సీట్లన సాధించడంలోనూ కీలకంగా వ్యవహరించిన ప్రియాంక రానున్న రోజుల్లో పార్టీని ముందుకు తీసుకుని పోతారని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *