జల్లికట్టు కోసం తమిళనాడులో శాంతియుతంగా జరుగుతున్న ఉధ్యమం హింసాత్మకంగా మారింది. జల్లికట్టు నిర్వహించుకునేందుకు వీలుగా ఆర్డినెన్సును జారీ చేసిన ప్రభుత్వం ఆందోళన విరమించాలంటూ పోలీసులు చేసిన విజ్ఞప్తిని ఆందోళనకారులు పెడచెవినపెట్టారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు మేరినా బీచ్ లోనే నిర్వహించాల్సి ఉన్నందున ఆందోళనకారులను అక్కడి నుండి పంపెందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. దీనితో ఆందోళనకారులను బలవంతంగా పంపెందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఆందోళనకురులు రెచ్చిపోయారు. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. దీనితో పోలీసులు లాఠీచార్జీ చేయడంతో పాటుగా టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. దీనితో చెల్లాచెదురైన ఆందోళనకారులు రెచ్చిపోయారు. బీచ్ సమీపంలో ఐస్ హౌసం పోలీస్ స్టేషన్ లోకి చొరబడిన ఆందోళన కారులు అక్కడ ఉన్న వాహనాలకు నిప్పుపెట్టారు. దీనితో 50కి పైగా వాహనాలు తగలబడ్డాయి.

మెరినా బీచ్ ప్రాంంతంలో తీవ్ర ఉధ్రిక్త నెలకొలడంతో ఆ ప్రాంతానికి అదనపు పోలీసు బలగాను తరలించారు. ఇన్నాళ్లు శాంతియుతంగా జరిగిన ఆందోళన హింసాత్మకంగా మారడంతో పోలీసులు కూడా కఠినంగానే వ్యహరిస్తున్నారు. మెరినా బీచ్ కు వెళ్లే అన్నిదారులను మూసేశారు. నగరంలోని ఇతర ప్రాంతాల నుండి వస్తున్న ఆందోళన కారులను వెనక్కి పంపిస్తున్నారు.
తమిళనాడులోని ఇతర ప్రాంతాల్లో కూడా జల్లికట్టు ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. జల్లికట్టుకు ప్రసిద్ధిగాంచిన అలంగానల్లూరులోనూ పరిస్థితి ఉధ్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జీ చేయాల్సి వచ్చింది. తిరిచ్చిలోనూ పరిస్థితి అదుపు తప్పింది. రాష్ట్రవ్యాప్తంగా జల్లికట్టు ఆందోళనలు అదుపు తప్పుతుండడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు పెద్ద సంఖ్యలో బలగాను మోహరిస్తున్నారు.