భారతీయ టెన్నీస్ స్టార్ సానియా మిర్జా జంట ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ లో ఓటమిపాలైంది చెక్ రిపబ్లిక్ చెందిన స్ట్రికోవా తో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ లో అడుగుపెట్టిన సానియా మిర్జా మూడో రౌండ్ లో ఇంటిదారి పట్టింది. జపాన్ కు చెందిన హోజుమి, మియకటే చేతిలో సానియా జోడీ 3-6,6-2,2-6 తేడాతో ఓటమి చెందింది. దీనితో సానియా భారత టెన్నీస్ అభిమానులు పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. డబుల్స్ స్పెషలిస్టు అయిన సానియా మిర్జా ఈ టోర్నిలో రాణిస్తుందని ఆశించినా ఈ జోడీ ముడో రౌండ్ లోనే వెనుతిరగాల్సి వచ్చింది. మొదటి రెండు మ్యాచ్ లలో కనబర్చిన ఆటతీరు ఈ జోడి ఈ మ్యాచ్ లో చూపలేకపోయింది. కొన్ని సార్లు సమన్వయ లోపం వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.