ట్రంప్ కు వ్యతిరేకంగా గళమెత్తిన మడోన్నా

అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కూడా డోనాల్డ్ ట్రంప్ కు నిరసన ప్రదర్శనల బెడద తగ్గడం లేదు. పెద్ద సంఖ్యలో మహిళలు ట్రంప్  కు వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ప్రఖ్యాత పాప్ స్టార్ మడోన్నా కూడా ట్రంప్ కు వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. ట్రంప్ వ్యతిరేకంగా జరుగుతున్న ర్యాలీలో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిల్చారు. ట్రంప్ కు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో తాము వెనక్కి తగ్గేది లేదని మడోన్నా అన్నారు. తాము దేనికీ భయపడేది లేదని తాము ఒంటరి వాళ్లం కాదని ఆమె పేర్కొన్నారు. తాము ఐక మత్యంతో ముందుకు సాగుతున్నామని తమని ఈ శక్తి అడ్డుకోలేదని అన్నారు. ‘వెల్‌కమ్‌ టు ది రివల్యూషన్‌ ఆఫ్‌ లవ్‌” అంటూ నినదించిన మడోన్నా కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. మడోన్నాతో పాటుగా పెద్ద ఎత్తున నినదించిన మహిళలు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ను ఒప్పుకునేది లేదంటున్నారు.  తాము ట్రంప్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్తున్నారు. ట్రంప్ మహిళా వ్యతిరేకి అని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *