వాస్తవానికి దగ్గరగా “రయీస్”

తన కొత్త చిత్రం “రయీస్” పాత్ర కల్పితమే అయినప్పటికీ వాస్తవానికి దగ్గరా ఉంటుందని షారుక్ ఖాన్ అన్నారు. తాను  అండర్ వరల్డ్ డాన్ గా నటిస్తున్న “రయీస్” లో ఈ పాత్ర వాస్తవానికి దగ్గరా ఉంటే విధంగా అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. తాను పాత్రలో నటించినా అందులో లీనమై నటిస్తానని చెప్పారు. ఒకసారి పాత్రను పోషించడానికి సిద్ధపడిన తరువాత దాని గురించి ఎక్కువగా ఆలోచించనని చెప్పారు. ప్రేక్షకులు తన పాత్రను ఒప్పుకుంటారా లేదా అనే విషయం పాత్రను ప్రారంబించే ముందే నిర్ణయించుకుంటానని ఒకసారి నిర్ణయించుకుని పాత్రలోకి ప్రవేశించాక ఎటువంటి ఆలోచనలు పెట్టుకోనని చెప్పారు. పాత్రలో లీనమైపోతే ఇక నటించడానికి పెద్దగా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని షారుక్ పేర్కొన్నారు. “రయీస్” లో తన పాత్ర చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పారు.