పెళ్లయిన 15 రోజులకే ఒక యువతి దారుణ హత్యకు గురైంది. కట్టుకున్న వాడే ఆమెను హత్యచేసి పారిపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఈ దారుణ ఘటన ఖమ్మం పట్టణంలో జరిగింది. ముస్తఫానగర్ చెందిన రేణుక (25) వ్యాన్ డ్రైవర్ గా పనిచేస్తున్న వెంకన్నలు ప్రేమించి పెద్దలను ఒప్పించి ఈనెల 6వ తేదీన పెళ్లిచేసుకున్నారు ఖమ్మం పట్టణం 13 డివిజన్ శ్రీరాంనగర్ లో ఇంటిని అద్దెకుతీసుకుని ఈనెల 11న కాపురం మొదలుపెట్టారు. రేణుక తల్లి శనివారం కూతురుకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవకపోవడంతో రేణుక తల్లి ఆమె ఇంటికి వచ్చింది. ఇంటికి తాళం వేసి ఉండడంతో అనుమానం వచ్చిన రేణుక తల్లి తాళం పగులగొట్టి చూడగా రక్తం మడుగులో రేణుక కనిపించింది. కూరగాయలు కోసే కత్తితో రేణుకను అత్యంత కిరాతకంగా హత్యచేసినట్టు పోలీసులు గుర్తించారు. రేణుక భర్త వెంకన్న ఇంటికి తాళం వేసినెళ్లినట్టుగా చుట్టుపక్కలవారు సమాచారం ఇచ్చారు. వెంకన్న ఫోన్ లో అందుబాటులోకి రాకపోవడంతో అతనే రేణుకను హత్యచేసి ఉంటాడని ఆమె తల్లి, బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసను నమోదు చేస్తున్నారు.