ఆ కట్టు మనకూ ఉండాలి:పవన్

జల్లికట్టుపై తమిళులు చేసిన పోరాటం స్పూర్తిదాయకంగా ఉందని జనసేన అధినేత, సినీ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నాడు. జల్లికట్టు కోసం తమిళులు ఒక్కతాటిపైకి వచ్చి పోరాటం చేశారని అదే తరహాలో ప్రత్యేక హోదా కోసం ఆంధ్రులు పోరాటం చేయాలని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. జల్లికట్టుకు వ్యతిరేకంగా తమిళులు చేసిన పోరాటంలో ఎక్కడా హింసాత్మక వాతావరణం నెలకొనకపోవడం హర్షించాల్సిన పరిణామమని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలని అయితే తమిళ రాజకీయ నేతల మాదిరిగా మన నేతలు కలిసి వస్తారా అనే అనుమానాలు తనకు ఉన్నాయన్నారు. రాజకీయా నేతలు కలిసి రాకున్నా ప్రజలు మాత్రం కలిసి వస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు. ప్రజల కోరికకు అనుగుణంగా ఆర్డినెన్సును తీసుకుని వచ్చిన కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నట్టు పవన్ కళ్యాణ్ చెప్పారు. ఉధ్యమం మరోరూపం దాల్చకుండా కేంద్ర ప్రభుత్వం త్వరపడి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు పవన్ చెప్పారు.