యూపీలో పొత్తుపై తొలగని సందిగ్థం

ఉత్తర్ ప్రదేశ్ లో రాజకీయాలు అనూహ్య మలుపులతో సినిమాను తలపిస్తున్నాయి. సమాజ్ వాదీ పార్టీలో చీలికలు ఆ తరువాత తండ్రిపై కుమారుడి తిరుగుబాటు దరిమిలా సమాజ్ వాదీ పార్టీ టికెట్లను ప్రకటించిన అఖిలేష్ యాదవ్ అందులో రాంగోపాల్ యాదవ్ పేరును చేర్చి మరో సంచలనం సృష్టించాడు. తండ్రీ కొడుకుల మధ్య వివాదానికే కేంద్ర బిందువుగా భావిస్తున్న రాంగోపాల్ యాదవ్ పేరును చేర్చడం ద్వారా అఖిలేష్ వర్గం భారీ ట్విస్ట్ ను ఇచ్చింది. ఇటు కాంగ్రెస్ తో పొత్తుపై గంటకో వార్త వస్తోంది. సమాజ్ వాదీ పార్టీ కాంగ్రెస్ మధ్య పొత్తు ఉంటుందా ఉండదా అనే దానిపై స్పష్టమైన ప్రకటన ఏదీ రావడం లేదు. కాసేపు పొత్తు ఖారారైనట్టు వార్తలు వస్తుండగా మరి కొద్ది సేపటికే పొస్తు లేదనే సంకేతాలు వస్తున్నాయి. మొత్తం మీద పొత్తుకు దారులు మూసుకుని పోయాయనుకునే సమయంలో కాంగ్రెస్ లో జట్టుకట్టడానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని అఖిలేష్ యాదవ్ కబురు పంపినట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ పొత్తుపై ఆశలు వదలుకున్న సమయంలో ఈ అఖిలేష్ కాంగ్రెస్ పార్టీకి 99 సీట్లను కేటాయించడానికి అంగీకరించినట్టు సమాచారం. 404 అసెంబ్లీ సీట్లున్న ఉత్తర్ ప్రదేశ్ శాసనసభలో తొలుత కాంగ్రెస్ పార్టీకి 95 నుండి 105 సీట్లు ఇచ్చేలా అఖిలేష్ , కాంగ్రెస్ ల మధ్య ఒప్పందం కుదిరింది. అటు అజిత్ సింగ్ పార్టీ ఆర్ఎల్డీతో కలిసి ఎన్నికల్లో పోటీచేయాని భావించినా ఆఖరి నిమిషంలో ఆ నిర్ణయానికి బ్రేక్ పడింది. కాంగ్రెస్ తో కూడా పొత్తు దాదాపు అసాధ్యం అనుకునే సమయంలో రంగంలోకి దిగిన ప్రియాంక, అఖిలేష్ భార్య డింపులు లు తెరవెనుక నడిపిన మంత్రాంగం ఒక కొలిక్కివచ్చినట్టు కనిపించినా మళ్లీ సమస్య మొదటికి వచ్చింది.
అఖిలేష్ కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లను ఇచ్చేందుకు అంగీకరించకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా 145 సీట్లను డిమాండ్ చేసింది. దీనితో పొత్తు దాదాపు ఖరారవుతుందన్న దశలో సీట్ల సర్దుబాటు కాగా ఎవరికివారుగానే పోటీచేయాలనే నిర్ణయానికి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆ మేరకు అభ్యర్థుల జాబితాను తయారు చేసుకుంటున్న క్రమంలో మళ్లీ కఖిలేష్ కాంగ్రెస్ కు 99 సీట్లను ఇవ్వడానికి రెడీగా ఉన్నట్టు సంకేతాలు పంపారు. దీనిపై కాంగ్రెస్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకం అయిన అమేధీ, రాయ్ బరేలీ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో అసెంబ్లీ సీట్లను సమాజ్ వాదీ ప్రకటించిన నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎట్లా ఉండబోతోంతి అనేది కీలకంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *