పాపం వైష్ణవి….

 
వైద్యుల నిర్లక్ష్యం వల్ల తమ బిడ్డ జీవితం అగమ్యగోచరంగా  మారిపోయిందని ఓ యువతి తల్లిదండ్రులు భోరుమంటున్నారు. ఆడుతూపాడుతూ ఉండే తమ కుమారై చిన్న ఆనారోగ్యంతో ఆస్పత్రిలో చేరితే ఇప్పుడు ఆమె జీవచ్చవంగా మారిపోయిందని బావురుమంటున్నారు. వైద్యుల నిర్వాకం పై మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. వారి కథనం ప్రకారం మౌలాలికి చెందిన వైష్ణవి జ్వరంతో నాచారంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. అక్కడ పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు జ్వరం వల్ల ప్లేట్ లెట్స్ తగ్గాయని జ్వరం వల్ల ఈవిధంగా  జరిగిందని చెప్పిన డాక్టర్లు హిమోగ్లోబిన్ తగ్గడంతో పీసీవీ కాంపోనెంట్స్ ఎక్కించారు. ఆ తరువాత యువతికి రియాక్షన్ తో  ఇన్  ఫెక్షన్ మొదలైంది. ఒక్కసారిగా పరిస్థితి విషమించడంతో నాచరంలోని ఆస్పత్రి వర్గాలు చేతులెత్తేశాయి. తమ వల్ల కాదని తేల్చిచెప్పడంతో సదరు యువతిని అపోలో ఆస్పత్రికి తరలించారు. యువతి పరిస్థితి తీవ్రం కావడంతో ఇన్ ఫేక్షన్ శరీరం మొత్తానికి పాకుతున్నట్టు గ్రహించిన వైద్యులు  వైష్ణవి కుడిచేయిని తొలగించారు. మరో కాలు చేయి కూడా తీసేయాల్సి రావచ్చని అపోలో వైద్యులు చెప్పినట్టు వైష్ణవి తల్లిదండ్రులు చెప్తున్నారు. తమ బిడ్డకు కేవలం జ్వరం వస్తే ఆస్పత్రిలో చేర్పించామని ఇప్పుడు ఆమె పరిస్థితి ఈ విధంగా తయారయిందని బావురుమంటున్నారు. తమ బిడ్డకు ఈ విధంగా జరగాడికి కారణం అయిన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *