జల్లికట్టును టెర్రరిజంతో పోల్చిన వర్మ

0
118
     తమిళనాడులో జల్లికట్టు నిర్వహించాలనే ఆందోళనలపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో స్పందించారు. జల్లికట్టును ఏకంగా టెర్రరిజంతో పోల్చిన వర్మ టెర్రరిజం కన్నా జల్లికట్టు ప్రమాదకరమైందిగా పేర్కొన్నారు. తమిళనాట జల్లికట్టుకు అనుకూలంగా సినీవర్గాలు చేస్తున్న ఆందోళనను వర్మవ్యతిరేకించారు. సంస్కృతిపేరుతో జీవహింస ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జల్లికట్టులో ఎద్దులు ఎదుర్కొనే హింస ఏ విధంగా సమర్థిస్తారని ప్రశ్నించారు. జీవసింహ దారుణమని జల్లికట్టును అనాగరిక చర్యగా అభివర్ణించారు. సంస్కృతి పేరుతో అరాచకాలు చేస్తున్నారని మండిపడ్డారు. మూగజీవాలపై ప్రతాపం చూపించే బదులు మనుషుల మీద మనుషులు ప్రతాపం చూపించవచ్చు కదా అన్నారు. ఎద్దులను వందల సంఖ్యలో జనం వేటాడడాన్ని సమర్థించే వారి పైకి వందల సంఖ్యలో ఎద్దులను వదిలిపెడితే అప్పుడు జీవహింస అంటే ఏమిటో అవి పడే ఇబ్బందులు ఏమిటో తెలుస్తాయన్నారు. జల్లికట్టును సమర్థిస్తున్న వారినీ వర్మ తీవ్రంగా విమర్శించారు.
Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here