నిజజీవితంలోనూ జైరా "దంగల్"

” దంగల్” సినిమాలో నటించి మెప్పించిన 16 సంవత్సరాల జైరా వాసిం పాపం నిజజీవితంలోనూ  సమస్యలతో కుస్తీపట్టాల్సి వస్తోంది. తన ప్రమేయం లేకుండానే ఈ బాలిక కొన్ని సార్లు వివాదాలకు కేంద్ర బిందువు అవుతున్నారు. తాజాగా జహీరా ను సాక్షాత్తూ కేంద్ర మంత్రి తాజాగా వివాదాల్లోకి లాగారు. ఢిల్లీలో   ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్‌గోయల్‌.. గ్యాలరీలో పంజరంలో నగ్నంగా కూర్చుని ఉన్న  ఓ బొమ్మను జైరా వసీంకు అన్వయించారు. ఆ చిత్రాన్ని ను ట్విట్టర్‌లో పోస్ట్‌చేసి.. ‘ఈ ఫొటో జైరా వసీం పరిస్థితికి అద్దం పట్టేలా ఉంది. మన బాలికలు పంజరాన్ని బద్దలు కొట్టి ముందుకు సాగుతున్నారు..’అని విజయ్‌గోయల్‌ కామెంట్‌ చేశారు. కొద్దిసేపటికే జైరా వాసీం ఆ  పోలికను తప్పుపడుతూ ప్రత్యుత్తరమిచ్చింది. తాను సదరు చిత్రంతో ఏ విధంగా కనెక్ట్ అవుతాను అంటూ ప్రశ్నించింది. బురఖా వేసుకున్న మహిళలు కూడా స్వేచ్చగానూ..అందంగానూ ఉంటారంటూ సమాధానం ఇచ్చింది. దీనికి మంత్రి సమాధానం ఇస్తూ తన వ్యాఖ్యలను తను తప్పుగా అర్థం చేసుకుందని జహీరా చాలా సాధించింది నీలాగే బాలికలు బంధనాలు తెంచుకుని ముందుకు రావాలనేదే తన అభిమతమంటూ దీనికి ముగింపు పలికారు.
దంగల్ సినిమాలో చిన్నతనంలో గీతగా నటించిన జమ్ముకాశ్మీర్ కు చెందిన ఈ బాలిక ఫేస్ బుక్ లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పంద అయ్యాయి. వేర్పాటు వాదుల నుండి బెదిరింపులను సైతం ఎదుర్కోవాల్సి వచ్చిందీ బాలిక. దంగల్ సినిమా విజయవంతం అయిన తరువాత జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని కలవడం తరువాత కాశ్మీర్ యువతులు తనను ఆదర్శంగా తీసుకోవాలంటూ ఫేస్ బుక్ లో వ్యాఖ్యానించడంతో ఆమెకు సమస్యలు మొదలయ్యాయి. ముస్లీం సంప్రదాయాలను మంటగలుపుతోందంటూ సంప్రదాయవాదులు, వేర్పాటు వాదులు బెదిరింపులకు దిగడంతో తన పోస్టును తొలగించి తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఆ తరువాత క్షమాపణల పోస్టును కూడా తొలగించింది.
 
Dangal Fame Zaira Wasim has now become a center point of many controversies. The issue which started with her facebook post has been taking many twist and turns. With many people dragging her in the news for not so good reason didn’t spare her even after her apologies. Many Bollywood stars have been tweeting in her support but inspite of that with her continuous posts in response to the news and immediately she deleting the same has definitely brought adverse reactions against her.
With many celebs against the trolling of the sixteen year old Zaira, lately the tweet of the union minister Vijay Goel  was questioned by her. Whether in Burkha or not a girl is always beautiful and his comment is not at all acceptable to which he replied that he was being misunderstood and he is all praise to the dangal girl. Even otherwise many muslim supporters are blaming her for defaming their traditions.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *