పాకిస్థాన్ లో పతంజలి ఉత్పత్తులు

 
పాకిస్థాన్ లోనూ పతాంజలి ఉత్పత్తులను అమ్మడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు యోగా గురువు, పంతాంజలి ఉత్పత్తుల ప్రచార కర్త బాబా రాందేవ్ చెప్పారు. ఇప్పటికే బాంగ్లాదేశ్ తో పాటుగా ఆఫ్రీకా దేశాలకి పతాంజలి గ్రూప్ విస్తరించిందని చెప్పారు. ఇప్పుడు పాకిస్థాన్ లోనూ తమ సంస్థ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు రాందేవ్ బాబా చెప్పారు. పాకిస్థాన్ లో పేదరికమే ప్రధాన సమస్యని చెప్పారు. పాకిస్థాన్ లో పేదరికం నశిస్తే వారు భారత్ కు ఎప్పుడూ శతృవులు కాబోరని అన్నారు. తాము ఆర్జించే డబ్బును పేదల సంక్షేమం కోసమే ఖర్చు చేస్తామని వెల్లడించారు. బహుళ జాతి సంస్థల మాదిరిగా పేదల సొమ్మును కొల్లగొట్టే ఉద్దేశం తమకు లేదన్నారు. తాము ఆర్జించిన  సొమ్మును పేదల కోసమే ఖర్చు చేస్తామన్నారు. పతాంజలి ఉత్పత్తుల వల్ల బహుళజాతి సంస్థలకు కంటిమీద కునుకు లేకుండా పోయిందన్నారు. వారు డబ్బులు కొల్లగొట్టడానికే వ్యాపారం చేస్తున్నారు తప్ప సేవ చేయాలనే తపని వారికి లేదన్నారు. రూపాయి పెట్టుబడితో వారు వంద రూపాయలు కొల్లగొడుతున్నారన్నారు.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *