పనిఒత్తిడితో క్యాన్సర్ ముప్పు

పని ఒత్తిడి అధికంగా ఉండేవారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పని ఒత్తిడి ఎక్కువగా ఎదుర్కొనే వారికి క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ముఖ్యంగా పురుషుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. పని ఒత్తిడి కారణంగా పెద్ద పేగు, మలద్వార, రక్త,జీర్ణాశయ, ఊపిరిదిత్తుల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని కెనడా యూనివర్సిటీ గుర్తించింది. 15 సంవత్సరాలు ఆ పైన పనిఒత్తిడి ఎక్కువగా ఉన్న ఉద్యోగాలు చేసే వారు క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వీరి పరిశోధలో తెలింది. ఎక్కువ పని, సమయంతో పాటుగా ఒత్తిడిని ఎదుర్కోవడం కాన్సర్ కు కారకం అవుతున్నాయి. అయితే 15 సంవత్సరాల కన్నా తక్కువ సమయంలో పని ఒత్తిడిని ఎదుర్కొన్నవారిలో ఈ లక్షణాలు కనిపించలేదని ఈ పరిశోధనలో తేలింది. ఎక్కువ పనిఒత్తిడితో పనిచేస్తున్న వారూ బహుపరాక్…