ఉలిక్కిపడుతున్న తమిళ తారలు

ఎంకి పెళ్లి సుబ్బిచావుకి వచ్చిందట…  జల్లికట్టుపై సుప్రీంకోర్టు విధించిన నిషేధం కొందరు సినీతారల తలలకు చుట్టుకుంటోంది. జల్లికట్టుపై సుప్రీంకోర్టులో కేసువేసిన జంతుకారుణ్య సంస్థ “పెటా” పై తమిళనాడులో నిప్పులు చెరుగుతున్నారు. ఈ సంస్థకు మద్దతు ప్రకటించి “పెటా” కు మద్దతుగా ప్రచారం నిర్వహించిన సినీతారలను ఇప్పుడు సమస్యలు వెంటాడుతున్నాయి. జల్లికట్టుకు మద్దతుగా పెద్ద ఎత్తున తమిళనాడులో ఉధ్యమం జరుగుతున్న సమయంలో గతంలో “పెటా” కు మద్దతు ప్రకటించిన సినీతారులు ఇప్పుడు ప్రజలు ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తోంది. గతంలో “పెటా” కు మద్దతుగా సినీతారులు ప్రచారం చేసిన ఫొటోలతో సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుండడంతో తారలకు తలనొప్పిగా మారింది. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఎక్కువగా ఇబ్బంది పడింది హీరోయిన్ త్రిష. ఆ అందాల భామకు వ్యతిరేకంగా ప్రజలు తీవ్రంగా స్పందించడంతో త”పెటా” కు తన కూమారై దూరం అయిందని ఆ సంస్థతో తన కూతురికి సంబంధాలు లేవని త్రిష తల్లి ప్రకటించింది.
అటు హీరోలు విశాల్, ఆర్యాలు కూడా గతంలో “పెటా” మద్దతుగా ప్రచారం చేశారు. ఇప్పుడు వారు కూడా తాము “పెటా”కు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించడంతో పాటుగా జల్లికట్టుకు మద్దతుగా పోరాటంలో పాల్గొంటున్నట్టు ప్రకటించారు. నాజర్‌, మమ్ముటి, దర్శకుడు శంకర్‌, ఎమీజాక్సన్‌, కీర్తిసురేష్‌లు కూడా గతంలో పెటాకు మద్దతుపలికిన వారిలో ఉన్నారు. వారు కూడా ఇప్పుడు తమ వైఖరిని మార్చుకుంటూ పెటాకు దూరం అయ్యామంటూ ప్రకటనలు చేయాల్సి వస్తోంది. తమిళనాట జరుగుతున్న ఉధ్యమం తమ మెడకు చుట్టుకోకుండా వీరు జాగ్రత్త పడుతున్నారు.
 
Few tamil film industry stars are now facing retaliation of the public. The stars who supported ‘PETA’ in the past and had advertised for the same are now under obligation whether or not to continue the support with the protests to remove ban on Jallikattu in Tamil Nadu gaining heat. With many posts circulating in social media opposing PETA with pictures of these film stars, many of them like Vishal, Surya, Mammoti, director Shankar etc who supported PETA in the past are now supporting Jallikattu publicly saying that the protest has now become a question of pride for Tamil people. Most effected star Trisha, had made an announcement through her mother that now she is no more connected to the organization and is in full support to Jallikattu.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *