మహోధ్యమంగా జల్లికట్టు -రాష్ట్రంలో సంపూర్ణంగా బంద్

జల్లికట్టుపై తమిళనాడులో జరుగుతున్న ఉధ్యమం తీవ్ర రూపం దాలుస్తోంది. జల్లికట్టును తొనసాగించి తీరాల్సిందే నంటూ పెద్ద ఎత్తున మొదలైన ఉధ్యమం ఇప్పుడు దావానలంగా వ్యాపించింది. ప్రజలే స్వచ్చంధంగా నిర్వహిస్తున్న ఉధ్యమానికి అన్ని పక్షాలు మద్దతు ప్రకటిస్తున్నాయి. జల్లికట్టుకు మద్దతుగా తమిళనాడులో బంద్ పూర్తి స్థాయిలో జరుగుతోంది. జల్లికట్టుపై సుప్రీంకోర్టు విధించిన నిషేదానికి వ్యతిరేకంగా జరుగుతున్న బంద్ కు ప్రజల నుండి పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తోంది. చెన్నైతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు నడవడం లేదు, దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. బంద్ సంపూర్ణంగా జరుగుతోంది. బంద్ కు ప్రజలు పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటిస్తున్నారు. ప్రజల్లో జల్లికట్టుపై వస్తున్న స్పందనతో రాజకీయ పార్టీలు కూడా బంద్ కు మద్దతుగా రంగంలోకి దిగాయి. డీఎంకే కార్యకర్తలు రైల్ రోకో ను చేపట్టారు. దీనితో పలు ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
జల్లికట్టుపై ప్రజల్లో వస్తున్న ఆందోళనతో తమిళనాడు ప్రభుత్వం ఇరకాటంలో పడింది. దీనిపై జోఖ్యం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేకపోవడంతో ఆర్డినెన్సు ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కోర్టు పరిధిలోని అంశం కావడంతో కేంద్ర ప్రభుత్వం జల్లికట్టుకు అనుకూలంగా వ్యవహరించేందుకు ముందుకు రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే ఆర్డినెన్సును తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తోంది. చిన్న మొదలైన జల్లికట్టు అనుకూల ఉధ్యమం ఒక్కసారిగా ఉధృత రూపం దాల్చడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెస్ను దిశగా ఆడుగులు వేస్తోంది.
 
Showing solidarity the people of Tamil Nadu came together to protest against the ban on Jallikattu entered its fourth day. Public have been continuing the protest peacefully even by staying overnight at the famous Marina beach. The chief minister of Tamil Nadu, O.Paneer selvam asked the public to withdraw their agitation and said that Jallikattu will be organized in the state in a day or two. After meeting the Prime Minister in New Delhi he organized cabinet meeting in Chennai on Thursday evening.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *