మంత్రులకన్నా తోలు బొమ్మలు నయం:రేవంత్

తెలంగాణ శాసనసభ కుటుంబ సభలాగా మారిపోయిందని తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్షం నేత రేవంత్ రెడ్డి విరుచుకుని పడ్డారు. మంత్రులు కేవలం తోలుబొమ్మల్లాగా మిగిలిపోయారని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన తనయుడు కేటీఆర్ మేనల్లుడు హరీష్ రావులే సభలో ప్రతీదానికి సమాధానం చెప్పారని మంత్రులు కేవలం ఉత్సవ విగ్రహాల్లాగా మిగిలిపోయారని రేవంత్ మండిపడ్డారు. తమ శాఖలకు సంబంధించిన అంశాలపై కూడా మాట్లాడే అవకాశం మంత్రులకు ఇవ్వలేదని వారు దయనీయమైన స్థితిలో ఉండిపోయారని రేవంత్ అన్నారు. సీనీయర్లు గా చెప్పుకునే కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు లకు కూడా సభలో అవమానం జరిగిందని రేవంత్ ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ ఆలీని కూడా పక్కన పెట్టారని కేవలం ఆ ముగ్గురు తప్ప మరొకరికి సభలో మాట్లాడే అవకాశం రాలేదన్నారు.
విపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ముఖ్యమంత్రి పారిపోయాడని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రుణమాఫి చేయలేమని ముఖ్యమంత్రి అంగీకరించాడని అన్నారు. రైతుల ఆత్మహత్యల విషయంలో తెలంగాణ రెండో స్థానంలో ఉంటే కనీసం రైతుల సమస్యలపై సమగ్ర చర్చ జరగలేదని రేవంత్ విమర్శించారు. నకిలీ విత్తనాలపై సభలో చర్చ జరక్కుండా ప్రభుత్వం జాగ్రత్త పడిందన్నారు. రైతుల సమస్యలు పట్టని ప్రభుత్వం విద్యార్థులను కూడా పట్టించుకోవడం లేదని రేవంత్ మండిపడ్డారు.
 
 
TDP legislature party leader Revanth Ready expressed his disappointment over the functioning of the Telangana assembly. Except KCR, KTR, Harish Rao all the other leaders  have just become puppets with no say during the assembly sessions. The state assembly has now become a family show he added. He also said that not being given a chance to speak in the assembly is an  insult to the party senior leaders like Kadiyam Srihari, Tummala Nageswar Rao. He also questioned that why except for these three even the deputy chief minster was just a spectator in the assembly. Revanth Reddy blamed the chief minister KCR for controlling the assembly sessions in favour of his government by not answering the opposition party questions. He went on to say no proper discussions were held on many subjects including the farmer suicides when it was very important since Telangana stands second in the country in farmes suicide rate. He said the performance of the state government is upsetting as it is not able to do any form of justice to either farmers or students.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *