ద్యావుడా చిత్ర దర్శకుడి అరెస్ట్

దేవుళ్లను కించపర్చే విధంగా ఉన్న “ద్యావుడా” సినిమా దర్శకుడు సాయిరాంను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. సినిమా ట్రైలర్ పేరుతో యూట్యూబ్ లో విడుదల అయిన దృశ్యాలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చిత్రంలోని దృశ్యాలపై అభ్యంతరం వ్యక్తం చేసిన బ్రాహ్మణ సంఘాలు డీజీపిని కలిసి చిత్రంపై ఫిర్యాదు చేశాయి. దీనిపై స్పందించిన డీజీపీ యూట్యూబ్ నుండి చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకున్నారు. ద్యావుడా సినిమా పై వచ్చిన ఫిర్యాదులపై దర్యాప్తు జరిపిస్తామని హామీ ఇచ్చారు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు చిత్ర దర్శకుడు సాయిరాంను అదుపులోకి తీసుకున్నారు. ఈ చిత్రంపై బ్రాహ్మణ సంఘాలతో పాటుగా పలు హింధూ సంస్థలు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దీనిపై స్పందించిన భజరంగ్ దళ్ హింధూ దేవుళ్లను అవమానిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
ద్యావుడా చిత్ర దర్శకుడి అరెస్టు పట్ల ఈ చిత్రంపై ఫిర్యాదు చేసిన బ్రాహ్మణ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఇటువంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *