ముదురుతున్న జల్లికట్టు వివాదం

తమిళనాడులో జల్లికట్టు వివాదాం ముదురుతోంది. జల్లికట్టును నిషేధించాలంటూ కొన్ని సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో వాటికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. జల్లికట్టును నిషేధిస్తు ఉత్తర్వులు జారీచేసింది. సుప్రీం కోర్టు తీర్పుపై తమిళనాడులో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. జల్లికట్టు అనేది పురాతన క్రీడ అని వేలాది సంవత్సరాల నుండి ఆనవాయితీగా వస్తున్న ఆచారం అని వారు వాదిస్తున్నారు. ఈ క్రీడలో జంతువులపై ఎటువంటి హింస జరగడంలేదని సుప్రీం కోర్టును పిటీషనర్లు తప్పుదోవ పట్టించారని వారు అంటున్నారు. జల్లికట్టను నిషేధించడంపై మొదట తమిళ సంఘాలు ఆందోళనలకు పిలుపునివ్వగా సామాజిక మాధ్యమాల్లో దీనిపై విపరీతంగా ప్రచారం సాగడంతో జల్లికట్టును నిర్వహించాలనే డిమాండ్ కు విద్యార్థులు, యువకుల నుండి భారీ మద్దదు లభిస్తోంది. పెద్ద సంఖ్యలో విద్యార్థులు జల్లికట్టును నిషేధానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. విద్యార్థులతో పాటుగా విద్యావంతులు, సాఫ్ట్ వేర్ రంగానికి చెందిన వారు, కార్పోరేట్ ఉద్యోగులు కూడా జల్లికట్టును నిర్వహించాల్సిందేనని ఆందోళన బాట పట్టారు. విద్యార్థుల నుండి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో కాలేజీలకు సెలవు ప్రకటించారు. యూనివర్సిటులు కూడా సెలవు ప్రకటించగా మరికొన్నింటిలో అనధికార సెలవు వాతావరణం నెలకొంది.
విద్యార్థులు, యువకులు, ఉద్యోగస్తులతో పాటుగా సనీ వర్గాలు కూడా జల్లికట్టును సమర్థిస్తున్నాయి. జల్లికట్టును నిర్వహించి తీరాలనే డిమాండ్ కు తమిళ సూపర్ స్టార్లు బహిరంగంగా మద్దతు పలకగా కొంత మంది సినీ నటులు స్వయంగా నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. తమిళనాడు వ్యాప్తంగా షూటింగ్ లను నిలిపివేశారు. జల్లికట్టు తమిళ సంస్కృతిలో భాగమని దీన్ని నిషేధించడం దారుణమంటూ జల్లికట్టును సమర్థించేవారు వాదిస్తున్నారు. జల్లికట్టు వివాదం రోజురోజుకూ ముదురుతుండడంతో తమిళనాడు సర్కారు ఆందోళన చెందుతోంది. పరిస్థితి ఆదుపుతప్పకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
జల్లికట్టు పై సుప్రీం కోర్టు నిషేదం విధించినప్పటికీ చాలా ప్రాంతాల్లో ఈ పోటీలు జరుగుతూనే ఉన్నాయి. వీటిని అడ్డుకునే సాహంసం పోలీసులు చేయలేకపోతున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు జల్లికట్టుకు మద్దతుగా వీధుల్లోకి వస్తుండడంతో వారిని అదుపుచేయడం పోలీసులకు తలకు మించిన భారంగా మారింది. జల్లికట్టును అడ్డుకోవడం సాధ్యం కాదని పోలీసులు చేతులు ఎత్తేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *