ప్రవచనాలకు దూరం కానున్న చాగంటి?

ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలకు దూరం కానున్నారా? ఆయన సన్నిహితులు కొందరు అవుననే అంటున్నారు. తన ప్రవచనాలతో తెలుగు రాష్ట్రాల్లో విశేష ప్రాచుర్యాన్ని శిష్యగణాన్ని సంపాదించుకున్న చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలకు దూరం కావాలనే కఠిన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తాను ప్రవచనాల్లో ఎవరినీ నొప్పించకపోయినా తనపై వస్తున్న వ్యతిరేక ప్రచారంతో ముస్థాపం చెంది ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు. ప్రవచనాలకు దూరం కావాలనే ఆయన నిర్ణయాన్ని అటు కుటుంబసభ్యులు ఇటు ఆయన శిష్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా స్వయంగా సున్నిత మనస్కుడిగా పేరుగాంచిన చాగంటి ప్రవచనాలకు దూరంగా ఉండాలనే నిర్మయించుకున్నారని చెప్తున్నారు.  ప్రవచనాలు చెప్తుంటే తనపై తరచూ కేసులు పెడుతున్నారని చాగంటి తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
ఇటీవల చాగంటి కృష్ణుడి గొప్పతనాన్ని చెప్పే క్రమంగాలో చేసిన వ్యాఖ్యలపై యాదవ కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనపై వివిధ ప్రాంతాల్లో కేసులను నమోదు చేశాయి.  “ఆయన పశువుల కాపరి ఇంట్లో పుట్టాడు. ఓ మహా విజ్ఞానవేత్తో, చక్రవర్తి కడుపున పుట్టిన వాడో కాదు. ఇంకా రామచంద్రమూర్తి అయితే, దశరధ మహారాజు కుమారుడిగా పుట్టాడు. కృష్ణుడు… ఏమీ తెలియని వాడు, తలగడిగితే మొల కడగరు, మొల కడిగితే, తల కడగరు… అటువంటి గొల్ల వాళ్ల ఇంట్లో పుట్టాడు” అంటూ చాగంటి చేసిన వ్యాఖ్యలపై యాదవ కుల సంఘాలు మండిపడ్డాయి. తమను కించపర్చే వ్యాఖ్యలు చేసిన చాగంటి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. దీనితో తన వ్యాఖ్యలు ఎవరిని కించపర్చేందుకు చేయలేదని అయినా తన వ్యాఖ్యలు ఎవరినైనా బాదిస్తే క్షమాపణలు చెప్తున్నానంటూ చాగంటి పేర్కొన్నారు. క్షమాపణ చెప్పినప్పటికీ పరిస్థితి సద్దుమణగకపోవడంతో చాగంటి తాను ఇక ప్రవచనాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.అయితే చాగంటిని ప్రవచనాలకు దూరంగా ఉండకూడదని పలువురు కోరుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చాగంటి లాంటి వారి ప్రవచనలా ఎంతో అవసరమని వారంటున్నారు.
ఇప్పటికే చాగంటి క్షమాపణలు చెప్పినందున ఈ విషయాన్ని యాదవ కుల సంఘాలు ఇంతటితో వదిలివేయాలని పలువురు కోరుతున్నారు. హింధువులను అవమాన పరుస్తున్న వారిని వదిలి చాగంటి లాంటి వారిపై కేసులు పెట్టడం సమంజసం కాదని, చాగంటి ఉద్దేశపూర్వకంగా ఒక సామాజిక వర్గాన్ని చులకన చేసి మాట్లాడలేదని వారంటున్నారు. ఆయన ప్రవచనాల వల్ల ఎవరికీ ఎటువంటి నష్టం జరగడం లేదని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *