చదివింది 5వ క్లాసు-జీతం 21కోట్లు

     ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన మసాలా బ్రాండ్ లలో ఒకటైన ఎండీహెచ్ మసాలా ప్యాకెట్లతో పాటుగా ఆ కంపెనీ ప్రకటనలలో కనిపించే ఆ కంపెనీ సీఈఓ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు. ఎండీహెచ్ కు సీఇఓగా ఉన్న 94 సంవత్సరాల ధరమ్ పాల్ గులాటి సంవత్సరానికి 21కోట్ల రూపాయల జీతం తీసుకంటూ వార్తల్లోకి ఎక్కాడు. ఎఫ్.ఎం.సీ.జీ రంగంలో అత్యదిక వేతనం అందుకుంటున్న సీఇఓగా రికార్డులు సృష్టించాడు. గోద్రెజ్, హింస్థాన్ యూనీలీవర్ కంపెనీల సీఇఓలను పక్కకు నెట్టి ఈ పెద్దాయన ఈ ఘనతను సాందించాడు.
ప్రస్తుతం 1500 కోట్ల రూపాయల టర్నోవర్ ను సాధిస్తున్న ఎండీహెచ్ కు గులాటీ 60 సంవత్సరాల నుండి సీఇఓ గా బాధ్యతలు నిర్వహిస్తుననారు. 94 సంవత్సరాల వయసులోనూ ఆయన ప్రతీరోజు విధులకు హాజరవుతారు. ఆదివారాలు కూడా సెలవు తీసుకోరు. 1919లో గులాటి తండ్రి ప్రస్తుత పాకిస్థాన్ సియాల్ కోట్ లో చిన్న మసాలా దుకాణాన్ని ప్రారంభించారు. విభజన తరువాత భారత్ కు వలస వచ్చిన వీరు ఢిల్లీలో చిన్న దుకాణం ప్రారంభించారు. ప్రస్తుతం ఎండీహెచ్ ఉత్పత్తులు 100 దేశలకు ఎగుమతి అవుతున్నాయి. ఈయనకు ఒక కుమారుడు, 6గురు కుమారైలు వారు కూడా ఎండీహెచ్ కంపెనీ వ్యవహారాలను చూస్తుంటారు. అయినా ఎండీహెచ్ కు సంబంధించిన అన్ని వ్యాపార వ్యవహారను ఇప్పటికీ స్వయంగా గులాటీనే పర్యవేక్షిస్తుంటారు. వ్యాపారంతో పాటుగా వీరు పాఠాశాలలు, ఆస్పత్రులను నిర్వహిస్తున్నారు. ఇంతకీ ఈయన చదివింది ఎంతో తెలుసా కేవలం ఐదో తరగతి మాత్రమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *