దావుద్ ఆస్తుల జప్తు ఉట్టిదే…

 
ముంబాయి బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు, అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రంహీం కు సంబంధించిన ఆస్తులను యునైటెట్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం జాతీయం చేసిందంటూ వచ్చిన వార్తలు కేవలం గాలి వార్తలుగా తేలిపోయింది. తమ దేశంలోని దావుద్ ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్టు వచ్చిన వార్తలు అన్నీ వట్టిదేనని అటువంటిదేమీలేదని యూఏఈ ప్రతినిధి అహ్మద్ అల్ బనా తెల్చిచెప్పారు. దావుద్ ఆస్తుల స్వాధీనం కోసం భారత్ చేసిన ప్రయత్నాలు ఫలించాయని మోడీ యూఏఈ కి వెళ్లినపుడు స్వయంగా దావుద్ ఆస్తులకు సంబంధించి అక్కడి ప్రభుత్వ అధినేతతో మాట్లాడారని దాని పర్యవసానంగానే దావుద్ ఆస్తులను జప్తు చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలన్నీ ఉట్టిదేనని తేలిపోయింది. ఆస్తులను జప్తు చేయాలంటే తమ దేశంలో అషామాషీ వ్యవహారం కాదని యీఏఈ ప్రతినిధి వెల్లడించారు. ఇటువంటివి న్యయవ్యవస్థ మాత్రమే చేసే వీలుందని అటువంటి ప్రక్రియ ఏదీ ఇంకా మొదలే కాలేదని ఆయన తేల్చిచెప్పారు.
దావుద్ ఆస్తుల సీజ్ అంటూ వచ్చిన వార్తలను బీజేపీ పెద్ద ఎత్తున తనకు అనుకూలంగా ప్రచారం చేసుకుంది. దావుద్ ఇబ్రహీంకు మాస్టర్ స్ట్రోక్ అంటూ చేసిన ప్రచారం నిజం కాదని తెేలిపోయింది. దీనిపై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. బీజేపీ తన అనుకూల ప్రచారం కోసం దేశ ప్రజలను తప్పుదోవపట్టిస్తోందని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. తప్పుడు ప్రచారాలు చేసుకోవడం తద్వాారా మోడీని హీరోని చేసి చూపించడం బీజేపీకి అలవాటు గా మారిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారంతో ప్రజలను మభ్యపెట్టడం బీజేపీకి అలవాటేనని అదే అలవాటుతో పత్రికలకు కూడా తప్పుడు సమాచారం ఇస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అంటోంది.
 
Once again there is no fact in the recent news of indian government seizing the assets in UAE of the prime suspect in Mumbai bomb blasts and under world Dawood Ibrahim. UAE spokesperson Ahme Al Bana clarified that there is no such fact in the news of seizing the assets of Dawood by indian government in their nation.The news was that when Mr.Modi had visited UAE, the UAE Government had given leads and details of Dawood assets in their country and henceforth the Government of India had started the operation of the same. But UAE spokesperson confirmed that the news is fake and no such talks were held with Modi. He also added that such thing is not so easy as said in his country and even otherwise there is a proper procedure of law enforcement even if in any case it is required.
BJP leaders had used this news in their recent election campaigning projecting the achievement of Modi government. Now that it has been clarified as a fake news the opposition is blaming the government for misleading the public of india for their selfish need at the time of election campaigning. Congress stongly blamed BJP that it has become a habit of the party to spread wrong news in the nation only to project Mr.Modi as a hero which congress said is ethically unjust on their part. They blamed that it was previously limited to social media but now BJP is using even press for their unjust intentions.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *