నాన్నగారికి భారత రత్న ఇవ్వాలి:బాలకృష్ణ

స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్)కు భారత రత్న ఇవ్వాలనే డిమాండ్ ను మరోసారి తెరపైకి తెచ్చారు ఆయన తనయుడు, హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. తెలుగు ప్రజల ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా విస్తరించడంతో పాటుగా రాజకీయాల్లో తనదైన ముద్రను వేసిన ఎన్టీఆర్ కు బారతరత్న బిరుదు తో గౌరవించాల్సిన అవసరం భారత ప్రభాత్వానికి ఉందని బాలకృష్ణ చెప్పారు. ఎన్టీఆర్ వర్థంతిని పురస్కరించుకుని హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడారు.  రాజకీయాల్లో నూతన ఒరవడి తీసుకుని వచ్చి పరిపాలనలో అనేక సంస్కరణల ద్వారా ప్రజలకు విశేష సేవలను అందచేసిన ఎన్టీఆర్ ఎప్పటికీ తెలుగు ప్రజల మదిలో నిల్చిపోతారని ఆయన అన్నారు. అంతటి మహోన్నత వ్యక్తికి కొడుకుగా పుట్టడం తన పూర్వ జన్మ సుకృతం అన్నారు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్తాయిగా నిల్చిపోతారని అన్నారు.
 
Speaking on the death anniversary of NTR after garlanding his statue, hindupur Mla and his son Balakrishna once again demanded that late NTR should be given Bharat Ratna. He said that NTR was not only a great actor and but leader also. His work for the public is unforgettable till date since his reforms had changed the lives of the many. Balakrishna said that his works had brought fame to the telugu people and honouring NTR with Bharat Ratna would be just gesture.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *