చక్రం తిప్పిన బహు,బేటీలు

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు దాదాపుగా ఖరారయిపోయింది. రెండు పార్టీలతో పాటుగా అజిత్ సింగ్ పార్టీ కూడా కలిసి కూటమిగా ఎన్నికల బరిలో దూకనున్నాయి. బీజేపీని కట్టడిచేసేందుకు జట్టుకట్టిన ఈ పార్టీల మధ్య స్నేహం వికసించడానికి ప్రధాన కారణం బహూ,బేటీలేనని తెలుస్తోంది. బహూగా అందరూ ముద్దుగా పిల్చుకునే అఖిలేష్ యాదవ్ భార్య, ములాయం కోడలు డింపుల్, బేటీగా పిల్చుకునే సోనియా గాంధీ కూతురు ప్రియాంక గాంధీలు పొత్తు కార్యరూపం దాల్చడానికి కీలకంగా వ్యవహరించినట్టు వార్తలు వస్తున్నాయి. తెరముందు అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీలు కనిపిస్తున్నా తెరవెనుక డింపుల్, ప్రియాంకలు కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది.
పార్టీ ఎంపీగా డింపుల్ ఢిల్లీలో ఉన్నప్పుడు ప్రియాంక గాంధీ, డింపుల్ ల మధ్య స్నేహం కుదిరింది. దీనికి తోడు రాహుల్ నియోజకవర్గంలో తరచూ పర్యటించే ప్రియాంక గాంధీ ఉత్తర్ ప్రదేశ్ రాజకీయ పట్ల మొదటి నుండి ఆశక్తి ఎక్కువ. ఈ నేపధ్యంలో సమాజ్ వాదీ పార్టీలో లుకలుక మొదలైనప్పటి నుండి అఖిలేష్ కు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు ప్రకటించింది. తండ్రి చేతిలో పార్టీ నుండి అఖిలేష్ ను బహిష్కరించిన తరువాత కూడా కాంగ్రెస్ అఖిలేష్ కు బాసటగా నిల్చింది. ఆ తరువాత పార్టీ పాగ్గాలు పూర్తిగా అఖిలేష్ చేతుల్లోకి రావడంతో సమాజ్ వాదీ పార్టీతో కాంగ్రెస్ పార్టీ స్నేహ జట్టుకట్టింది. బీజేపీని ఎదుర్కోవడానికి ఉత్తర్ ప్రదేశ్ లో తనకు కాంగ్రెస్ సహాయం అవసరమని సమాజ్ వాదీ పార్టీ భావించగా స్వతంగా ఎట్లాగూ అధికారంలోకి వచ్చే సత్తా లేని కాంగ్రెస్ సమాజ్ వాదీ పార్టీతో జట్టుకట్టి కనీసం పరువు నిలుపుకునే ప్రయత్నాల్లో ఉంది.
ఉభయతారకంగా ఉన్న సమాజ్ వాదీ-కాంగ్రెస్ ల పొత్తుల వ్యవహరాన్ని ప్రియాంక, డింపుల్ లే ఒక దారికి తీసుకుని వచ్చినట్టు సమాచారం. ఒంటరిగా పోటీ చేస్తే వచ్చే లాధం లేదని అటు రాహుల్ ను ఇటు అఖిలేష్ ను వీరిద్దరు ఒప్పించినట్టు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒంటరిగా పోటీచేయడం కన్నా భాగస్వాములతో కలుపుకుని ముందుకు వెళ్తే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని భావించిన వీరు కలిసికట్టుగా పోటీకి సిద్ధమవుతున్నారు. తెరవెనుక చక్రం తిప్పుతున్న బహు, బేటీలు ఎంతవరకు తమ వ్యూహాల్లో సఫలం అవుతారో వేచి చూడాల్సిందే.
 
With the assembly elections scheduled in a few weeks in Uttar Pradesh all eyes are on the final announcement of the grand alliance of Congress- SP-RLD. To win these elections against BJP all the three parties are coming together to form a single alliance. Though Rahul and Akhilesh are the face of their respective parties news of the major role played by ‘Bahu’ Dimple Yadav and ‘Beti’ Priyanka Gandhi in this formation is circling around.
The friendship between Dimple and Priyanka is quite not new but since the issues between father and son in Samajwadi Party, congress has been backing up Akhilesh. In this contest after Akhilesh was given the possession of Samajwad Party symbol,’cycle’even he realized that to win these elections against BJP after so much happening inside the party it would be in his best of interest to have an alliance with the congress. To this talks are being conducted with the Rashtriya Lok Dal leaders also on the issue of seat sharing with party chief Ajith Singh. With the intervention of Dimple and Priyanka in the present scenario playing a major role in the formation of alliance between Congress and SP to compete together in the upcoming assembly elections, voter shall decide how far this will do a favour to them.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *