600 మంది చిన్నారులపై లైంగిక దాడి

దాదాపు 600 మంది చిన్నారులను లైంగికంగా వేధించిన ఒక నరరూప రాక్షసుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. 38 సంవత్సరాల సునీల్ రస్తోగీ అనే కామాంధుడిని అరెస్టు చేసిన పోలీసులకు నిస్మయకరమైన నిజాలు తెలిశాయి. నిందుతుడు చెప్పిన విషయాలు విని పోలీసులే నోళ్లు వెళ్లబెట్టారు. ఢిల్లీలోని గాజియాబాద్ ప్రాంతంలో దాదాపు 600 చిన్నారులను ఈ నీచుడు లైంగికంగా వేధింపులకు దిగాడు. వీడి బారిన పడినవాళ్లంతా 12 ఏళ్ల లోపు బాలికలే. చాక్లెట్లు, కొత్త బట్టల ఆశచూపి చిన్నారులపై లైంగిక దాడి చేయడం వీడి నైజం. చిన్నారుల తండ్రుల స్నేహిడుతుడిగా తనను తాను పరిచయం చేసుకుని చిన్నారులను నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకునిపోయి లైంగికంగా వేధించేవాడు.
నిర్మాణంలో ఉన్న ఒక భవనంలో 7 సంవత్సరాల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డ రస్తోగికి సంబంధించి ఒక చిన్నారి చెప్పిన పోలికల అధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. చిన్నారి చెప్పిన గుర్తుల ప్రకారం నిందితుడి ఊహా చిత్రం గీయించి విచారణ ప్రారంభించిన పోలీసులకు ఎట్టకేలకు రస్తోగి ఉత్తరాఖండ్ లో దొరికాడు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులకు విచారణలో వాడు వెల్లడించిన నిజాలు కళ్లు బైర్లు కమ్మెలా చేశాయి. 1990 నుండి 2004 వరకు ఢిల్లీలో ఉన్న ఈ కామాందుడు దాదాపు 600 మంది చిన్నారులను లైంగికంగా వేధించాడు. చిన్నారులను నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకుని పోయి వికృతంగా ప్రవర్తించేవాడు. వీడి ఆగడాలు చాలా కాలం పాటు వెలుగులోకి రాకపోవడం బాధితులంతా చిన్న పిల్లలు కావడంతో ఇన్నాళ్ళు తప్పించుకోగలిగాడు. ఒక చిన్నారి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో వీడి ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి.
నిందితుడిగి సంబంధించి పోలీసులు పకడ్బందీగా ఆధారాలను సేకరిస్తున్నారు. 600 మందికి పైగా చిన్నారులపై లైంగిక దాడులకు దిగిన ఈ మానవ మృగాన్ని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *