భారతీయులను అవమానించమే వారి పనా?

భారతీయులను అవమానించడమే వారి లక్ష్యమా… వారి చర్యలు కేవలం మానవ తప్పిదాలు అనుకోవాల లేక మరేదైనానా… భారతీయులకు ముఖ్యంగా ఒక వర్గానికి సంబంధించి ఎప్పూడూ ఏదో ఒక ఉత్పత్తులతో రెచ్చగొడుతూనే ఉంటారు. మన దేవతలను అసభ్యంగా చిత్రీకరించడం దగ్గర నుండి దేవతలు చిత్రాలతో చెప్పులు, కాళ్లు తుడుచుకునే పట్టాలు తయారు చేసి ఆన్ లైన్ లో అమ్మకానికి ఉంచుతుంటారు. ఇటువంటి వాటిపై ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా స్పందన కనపించడం లేదు. ఇటీవల ఒక సంస్థ మన తివర్ణ పతాన్ని పోలిన కాళ్లు తుడుచుకునే పట్టాలను ఆన్ లైన్ లో ఉంచితే తాజాగా జాతిపిత గాంధీ చెప్పులు అమేజాన్ లో దర్శనమిచ్చాయి. తివర్ణ పతాకం పై కేంద్ర మంత్రి సుష్మ స్వరాజ్ తీవ్రంగా హెచ్చరించిన తరువాత వెంటనే సదరు ఉత్పత్తులను తొలగించిన అమేజాన్ ఇప్పుడు జాతిపిత చెప్తులను అమ్మకానికి పెట్టింది. దినిపై కూడా భారతీయులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉత్పత్తులను అమ్మకానికి ఉంచే ముందు ఆన్ లైన్ సంస్థలు కనీస జాగ్రత్తులు తీసుకోవడం లేదు. వ్యాపారం ద్వారా వేలాది కోట్ల రూపాయలను పోగు చేసుకుంటున్న బహుళ జాతి సంస్థలకు వ్యాపారం తప్ప ప్రజల మనోభావాలతో సంబంధం లేదా…
భారత్ లో తమ ఉత్పత్తులను అమ్ముకుంటూ వేలాది కోట్లను దండుకుంటున్న సంస్థలు కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదా… అమేజాన్ లో ఎవరైనా తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు అయితే ప్రతీ వారు తమ ఉత్పత్తును ఉమ్ముకోవడానికి అమేజాన్ కు కొంత మొత్తంలో రుసుము చెల్లిచడంతో పాటుగా వారి అనుమతి లేకుండా ఎటువంటి ఉత్పత్తులను ఆన్ లైన్ లో ఉంచడం కుదరదు. అయినా ఇటువంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. అసలు ఇటువంటి ఉత్పత్తులను తయారు చేసే వారిపైనా చర్యలు తీసుకోవాల్సిన అసవరం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *