త్వరలో నగదు ఉపసంహరణ పరిమితి పెంపు?

పెద్ద నోట్ల రద్దు తరువాత నగదు కష్టాలు కొద్దిగా తీరనున్నాయి. బ్యాంకుల్లో తగినన్ని నగదు నిల్వలను పంపుతున్నట్టు ఆర్బీఐ పేర్కొంది. నగదు లభ్యత ప్రస్తుతం పెరిగిందని ఆర్బీఐ చెప్తోంది. బ్యాంకుల్లో క్యూ లైన్లు తగ్గాయని చెప్తోంది. మరో వైపు నగదు లభ్యత కొద్దిగా పెరగడంతో ప్రస్తుతం నగదు ఉపసంహరణ పై ఉన్న పరిమితులను క్రమంగా సడలించేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ప్రస్తుతం వారానికి 24 వేలకు మించి నగదును ఉపసంహరించే అవకాశం లేదు. ఈ పరిమితిని 35 వేలకు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే నగదు ఉపసంహరణ పరిమితిని 35 వేల పెంచే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కేంద్ర ఆర్థిక శాఖ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు త్వరలోనే నగదు ఉపసంహరణ పరిమితిని 35 వేల కు పెంచడానికి కసరత్తులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఏటీఎం నుండి రోజులు 4వేల రూపాయలను మాత్రమే ఉపసంహరించుకునే అవకాశం ఉంది. ఈ మొత్తాన్ని కూడా పెంచే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే బ్యాంకుల్లో క్యూలు తగ్గుతున్నాయని కొత్త నోట్లను ప్రజలు బ్యాంకుల్లో డిపాజిట్లు చేయడం మొదలు పెట్టడంతో పరిస్థితులు చక్కబడుతున్నాయని ఆర్థిక వర్గాలు చెప్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నగదు ఉపసంహరణ పరిమితిని మరింత పెంచి దాన్ని 35 వేలకు పెంచాలని ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు అత్యంత త్వరలోనే ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
In this festive season as a relief to general  public, cash withdrawal limit from ATM has been increased from previous  4500/- limit to 10000/- rupees per day. But the weekly 24000/- cash limit per account remains intact. After the note ban there was difficulty in cash transactions, as the rotation of new currency is picking up there is some relief being felt for loose cash. As for current account the cash withdrawal from banks has been increased to 100000/- per week cash limit. This should be a good news for small retail businesses. With new notes also being deposited in the banks there has been a positive development and as on this finance ministry and RBI had been preparing since past few days to ready itself for this announcement.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *