ఇళ్లపై కూలిన విమానం-32 మంది మృతి

 
కిర్గిస్థాన్ లో విమానం ఇళ్లమీద కూలిపోయిన ఘటనలో 32 మంది మృతిచెందారు. టర్కీకి చెందిన విమానం మనాస్ విమానాశ్రయం దగ్గర్లో ఇళ్ల మీద కూలిపోయింది. దీనితో ఇళ్లలోని వారు మృతిచెందారు. ప్రమాదం స్థానిక కాలమానం ప్రకారం 7.30కు జరగడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. అందరూ ఇళ్లలోనే ఉన్న సమయంలో ప్రమాదం జరగడంతో ఇళ్లలో ఉన్న వారు మృత్యువాత పడ్డారు. ప్రమాదంలో మరణించిన వారిలో చిన్నారు కూడా ఉన్నారు. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ వద్ద జరిగిన ఈ ప్రమాదానికి కారణమైన విమానం హాంకాంగ్ నుండి మనాస్ ఎయిర్ పోర్టుకు వస్తోంది. ప్రతికూల వాతావరణం వల్లే ఈ ప్రమాదం జరిగిఉంటుందని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఈ ప్రాంతంలో గట్టమైన పొగ మంచు కమ్ముకుని ఉంది. విమాన శకలాలను తొలగించి సహాయక కార్యక్రమాలను చేపడుతున్నారు. అయితే వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో సహాయక కార్యక్రమాలకు ఆటంకం కలుగుతోంది. పెద్ద శబ్దంతో విమానం ఇళ్లపై కూలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *