మూడు వన్డే సిరీస్ లో భాగంగా పూణే లో జరిగిన తొలి మ్యాచ్ లో భారత్ అద్భుతంగా ఆడి మూడు వికెట్ల తేడాతో తొలి మ్యాచ్ ను గెల్చింది. 350 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంకా 11 బంతులు మిగిలి ఉండగానే భారత్ అందుకుంది. టాస్ గెల్చిన భారత్ ఇంగ్లాండ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. నిర్ణిత 50 ఓవర్లలో ఇంగ్లాండ్ 350 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బతలిగింది. ఒపెనర్లు శిఖర్ ధావన్ (1), రాహుల్ (8) పరుగులకే పెవీలియన్ చేరగా సీనియర్ ఆటగాళ్లు యువరాజ్ సింగ్ (15), మాజీ కెప్టెన్ ధోని (6) లు పెవీలియన్ బాటపట్టారు. ఈ దశలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్థానిక ఆటగాడు జాదలు రెచ్చిపోయారు. అద్భుతమైన స్ట్రోక్స్ తో అలరించిన ఇద్దరూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. బౌండరీలకు నలువైపులా అడుతూ చక్కని షాట్లతో అలరించారు. విరాట్ కు పోటీగా జాదవ్ ఆట తీరు అందరనీ ఆకట్టుకుంది. కండరాలు పట్టేసినా జాదవ్ స్కోరు ను ఉరకలెత్తించారు.
భారత్ పూర్తిగా పటిష్టమైన స్థితికి చేరుకున్న తరవాత జాదవ్, కోహ్లి వెంట వెంటనే జౌట్ అయినా హార్థిక్ పాండ్యా చక్కగా ఆడాడు. అశ్విన్ సహకారంతో మరో ోవికెట్ నష్టపోకుండా భారత్ ను విజయతీరాలకు చేర్చారు. పాండ్యా 40 పరుగులు చేయగా ఫశ్విన్ 15 పరుగులు చేశాడు.