ఇంకా దొరకని 35కేజీల బంగారం

ముత్తూట్ ఫైనాన్స్ లో భారీ దోపిడీకి పాల్పడిన దొంగలు దొరికినప్పటికీ వారి నుండి పూర్తి బంగారం మాత్రం లభించలేదు. దుండగులు దాదాపు 41 కేజీల బంగారాన్ని దోచుకుని పోగా ప్రస్తుతం 3.5 కేజీల బంగారం మాత్రమే లభించింది. బంగారంతో పాటుగా 5 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దోపిడీకి పాల్పడిన వారిలో ఐదు గురిని పోలీసులు అరెస్టు చేయగా మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. వారిని కూడా పట్టుకుంటేనే బంగారం మొత్తం స్వాధీనం అయ్యే అవకాశాలు ఉన్నాయి. దొంగతనాలతో పాటుగా అనేక నేరాల్లో ఆరితేరిన ఈ ముఠా బంగారాన్ని పూర్తిగా కరించివేసింది. వాటిని కడ్డీలుగా మార్చింది. పోలీసులు అత్యంత చాకచక్యంగా ముత్తూట్ ఫైనాన్స్ దొంగతనం కేసును చేధించినప్పటికీ వారి నుండి పూర్తిగా బంగారాన్ని స్వాధీనం చేసుకోలేకపోయారు. త్వరలోనే బంగారాన్న పూర్తిగా స్వాధీనం చేసుకుంటామని పోలీసులు చెప్తున్నారు.
ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీకి పాల్పడింది అల్లాటప్పా దోపిడీ దొంగలు కాదు నేరాల్లో ఆరితేరిన ముఠానే ఈ దొంగతనం చేసింది. వీరంతా దోపిడీలు, హత్యలతో పాటుగా మాఫియా కార్యకలాపాల్లో ఆరితేరిన ముఠాగా పోలీసులు గుర్తించారు. గత 20 సంవత్సరాలుగా ఈ ముఠా నేరాలకు పాల్పడుతూనే ఉంది. నేరాల్లో సంపాదించిన సొమ్ముతో వీరు భారీ నిర్మాణాలను నిర్మిస్తూ బిల్డర్లుగా అవతారం ఎత్తుతున్నారు. వందల కోట్ల రూపాయలు కూడగట్టుకుని సమాజంలో పెద్ద మనుషులుగా చాలామణి  అవుతున్నారు. వీరి నేరాల చిట్టా ఎక్కడా బయటపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎట్టకేలకు వీరి బండారాన్ని సైబరాబాద్ పోలీసులు బయటపెట్టారు.
ముత్తూట్ ఫైనాన్స్ కేసులో ప్రధాన నిందితుడు లక్ష్మణ్ తో సహా విజయ్ కుమార్,సుభాష్ పూజారి,త్రిలోక్ చంద్ షా, గణేష్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు రాజరత్నం, కాలా, రోషన్ యాదవ్ లు పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న ముగ్గురిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *