పండక్కి ఊరెళ్తున్నారా… ప్రయాణపు హడావుడిలో మీరుంటే మీ ఇంటిని చక్కబెట్టే పనిలో మరికొందరు కాచుకుని కుర్చున్న సంగతి గుర్తు పెట్టుకోండి. పండగలు వస్తే ప్రజలు ఒకరమైన వేడుకలు జరుపుకుంటే కొంతమందికి మాత్రం ఇది నిజంగానే పండగ సీజనే. తాళాలు వేసిన ఇంటిని గుర్తించి కన్నాలు వేసే బ్యాచ్ లు రెడీగా ఉంటున్నాయి. సంక్రాంతికి పెద్ద సంఖ్యలో వారివారి స్వస్థలాలకు వెళ్తుంటారు ఇదే అదనుగా పెద్ద సంఖ్యలో చోరులు నగరానికి చేరుకుని తమ పని తాము చేసుకునే పనిలో పడ్డారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
- బయటకు కనిపించేట్లు తాళం వేయకూడదు.
- ఎక్కువ రోజులు ఊరికి వెళ్తే ఆ సమాచారాన్ని పోలీసులకు ఇవ్వాలి.
- ఇంట్లో కాపలాకి ఎవరినైనా ఏర్పాటు చేసుకుంటే మంచిది.
- ఇంటికి సెంట్రల్ లాకింగ్ సిష్టం ను ఏర్పాటు చేసుకోవాలి.
- అపరిచితులకు ఇంటి గుర్తులు చెప్పవద్దు.
- ఊరికి వెళ్తున్న సంగతి అపరిచితులకు చెప్పవద్దు.
- పేపర్, పాల పాకెట్లు బయట ఉంటే మీరు ఊర్లో లేనట్టు సులభంగా తెలుస్తుంది. ముందుగానే వాటిని మాన్పించండి.
- తాళం కప్ప వేసినంత మాత్రానా మీ ఇల్లు సేఫ్ కాదనే విషయాన్ని గుర్తుంచుకోండి.
- అపార్ట్ మెంట్లో ఉండే వాళ్లు ఖచ్చితంగా వాచ్ మెన్ ను ఏర్పాటు చేసుకోవాలి.
- సిసి కెమేరాలను ఏర్పాటు చేసుకోవాలి.
- వీలైనంత వరకు విలువైన వస్తువులు ఇంట్లో ఉంచకపోవడం మంచిది
- ఊరికి వెళ్తున్నప్పుడు విలువైన వస్తువులు బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఉంచడం మంచిది.