వీసా నిబంధనలు మరింత కఠినం

భారతీయ ఐటి కంపెనీలతో పాటుగా హెచ్ -1 బి, ఎల్-1  వీసాల కోసం ఎదురుచూస్తున్న వారికి పిడుగులాంటి వార్త…ఈ రెండు విసాల నిబంధనలు మరింత కఠినం చేస్తున్నారు. భారతీయులు ఎక్కువగా ఈ రెండు వీసాలపైనే అమెరికాకు వెళ్తుంటారు. ఈ విసాల జారీలో నిబంధనలు కఠినతరం చేయడంతో మన ఐటి నిపుణలు, కంపెనీలపైనా తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్న డోనాల్డ్ ట్రంప్ విదేశీయులకు విసాలను మంజూరు చేసే అంశంలో కఠినంగా వ్యవహరించడానికి సిద్ధపడుతున్నాడు. విదేశీయులు అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారంటూ మండిపడుతున్న ట్రంప్ వీసాల నిబంధనలను కఠినం చేయడానికి సమాయత్తం అవుతున్నారు.
ట్రంప్ అటార్ని జర్నల్ గా నియమించడం దాదాపు ఖాయం అయిన  జెఫ్‌ సెషన్స్‌ వీసాల విషయంలో  కీలక వ్యాఖ్యలు చేశారు. ‘అమెరికన్ల ఉద్యోగాలను ప్రపంచంలో ఎవరితోనైనా భర్తీ చేసేంత, లీజుకు ఇచ్చేంత ఓపెన్‌ వరల్డ్‌లో ఉన్నామనుకోవద్దు..’ అని వ్యాఖ్యానించడం ద్వారా తమ ఉద్దేశాన్ని బయటపెట్టారు.  సెషన్స్‌, గ్రాస్లీలు హెచ్‌-1బీ వీసాల చట్టాలపై గతంలో కలిసి పనిచేశారు. వీరు రూపొందించిన బిల్లు ప్రకారం కంపెనీలు ముందుగా నిపుణుల ఎంపిక కోసం అమెకన్ల పేర్లను మాత్రమే పరిశీలించాలి. సదరు ఉద్యోగానికి అమెరికన్లు అందుబాటులో ఉండని పక్షంలో మాత్రమే విదేశీయులను ఎంపికచేయాల్సి ఉంటుంది. దీనితో పాటుగా 50 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థల్లో 50 శాతానికి మించి హెచ్-1 బి ఉద్యోగులు ఉండటానికి వీలు లేదు. ఇటువంటి చట్టాల వల్ల భారతీయులపై భారీ ప్రభావం పడుతుందని అంటున్నారు. ప్రస్తుతం స్వల్పకాలం కోసం అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వారు స్వదేశానికి రావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ వ్యవహరాం వల్ల ఐటి కంపెనీలు భారీగా నష్టపోవాల్సి వస్తుంది. ఇటు విదేశీ ఆశలు పెట్టుకున్న వారితో పాటుగా ప్రస్తుతం స్వల్ప కాలిక వీసాలపై ఉన్న వారికి కూడా తిప్పలు తప్పవు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *