అదరగొట్టిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. బాలకృష్ణ చిత్రం విడుదల సందర్భంగా ధియేటర్లలో పండుగ వాతావరణం కనిపించింది. బాలయ్య వందో చిత్రం కావడంతో పాటుగా చారిత్రక నేపధ్యంలో సాగే ఈ చిత్రం అభిమానుల అంచనాల కంటే మెరుగ్గా ఉందని అభిమానులు చెప్తున్నారు. బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి పాత్రలో ఒదిగిపోయారు. చిత్రంలో పోరాట దృశ్యాలు, భావోద్వేగాలు చిత్రానికే హైలెట్ గా నిల్చాయి. చిత్రాన్ని చూస్తున్నంత సేపు అప్పటి సమయానికి ప్రేక్షకులను తీసుకుని పోగలిగారు. ప్రేక్షకులు క్రీస్తు పూర్వానికి వెళ్ళిపోయినట్టుగా చిత్రాన్ని రూపొందించారని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిత్రంలో డైలాగ్స్ అద్భుతం అయితే బాలయ్య వాటిని చెప్పిన తీరు పరమాద్భుతం . మొత్తం మీద క్రిష్ దర్శకత్వ ప్రతిభకు అద్దంపట్టిన గౌతమీ పుత్ర మంచి విజవల్ ఫీస్ట్ గా చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *