యూపీలో బ్రాహ్మణ ఓట్లే కీలకం…

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో బ్రాహ్మణుల ఓట్ల కోసం అన్ని రాజకీయ పక్షాలు గాలం వేస్తున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ లో బ్రాహ్మణులు 10 శాతానికి పైగా ఉన్నారు. వీరిని తమ వైపు తిప్పుకోవడం ద్వారా ఎన్నికల్లో లబ్దిని పొందాలని అన్ని రాజకీయ వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. 10 శాతం ఉన్న బ్రాహ్మణ ఓట్లు అనేక నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేయగలవు. దీనితో పాటుగా బ్రాహ్మణులు ఉత్తర్ ప్రదేశ్ లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. చాలా నియోజక వర్గాల్లో ఇతర కులాల ఓట్లను కూడా ప్రభావితం చేయగల శక్తి ఈ వర్గం వారికి ఉంది. దీనితో వారి మద్దతును కూడాగట్టుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ లో ఎన్నికలు అంటేనే కుల ప్రాతిపదికన జరుగుతాయి. ఇక్కడ ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేసే ప్రధాన అంశం కులమే. ఈ సంప్రదాయం చాలా సంవత్సరాలుగా ఉత్తర్ ప్రదేశ్ లో పాతుకుని పోయి ఉంది. కులాల వారీగా ఓట్లు చీలిపోయే సంస్కృతి ఇక్కడ కనిపిస్తుంది.
అభ్యర్థి గుణగణాలు, అతను పోటీ చేస్తున్న రాజకీయ పార్టీ కన్న వారి కులాలే ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. ఒక్కో ఎన్నికల్లో ఈ కులాలు ఆయా పార్టీలకు మద్దతు ప్రకటించడంతో వారి ఓట్లు గంపగుత్తగా సదరు పార్టీకి పడుతుంటాయి. ఇక్కడ కుల రాజకీయాలతో పాటుగా కుల సంఘాల పట్టుకూడా ఎక్కువే. కుల సంఘాల నిర్ణయానికి కట్టుబడి ఓటువేసేవారి సంఖ్య ఉత్తర్ ప్రదేశ్ లో గణనీయంగా ఉంటుంది. దీనితో బ్రాహ్మణ వర్గం ఈ సారి ఎవరికి పడతాయనే దానిపై చర్చ జరుగుతోంది. సంప్రదాయంగా ఈ వర్గం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ వచ్చింది. అయితే కాలక్రమేణా మారిన రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో బ్రాహ్మణులు బీజేపీకి మద్దతు పలికారు. వీరు మద్దతు పలకడం వల్లే ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి రాగలిగిందని అంటారు.
కొద్ది రోజుల తరువాత బీజేపీకి బ్రాహ్మణ వర్గం దూరం అయింది. బ్రాహ్మణ, దళిత వర్గాల ఐక్యత పేరుతో మాయావతి చేసిన ప్రచారం సత్పలితాలను ఇచ్చింది. దీనితో పెద్ద సంఖ్యలో బ్రాహ్మణులు మాయవతికి మద్దతు పలికారు. మాయవతి అధికారంలోకి రావడానికి ఈ నినాదం కూడా ఒక కారణం. మాయవతి రాజకీయాలతో విసిగిన బ్రాహ్మణులు బీఎస్పీకి కూడా దూరం అయ్యారు. గత ఎన్నికల్లో బ్రాహ్మణుల ఓట్లు అన్ని పార్టీల మధ్య చీలిపోగా ప్రస్తుతం వారి ఓట్లను గంప గుత్తగా పొందడానికి బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. తమకు దూరం అయిన ఈ వర్గాన్ని తిరిగి దగ్గరచేసుకుని వారి మద్దతు పొందాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ప్రస్తుతానికి బ్రాహ్మణ వర్గం బీజేపీకి కొద్దిగా అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తోంది. అటు కాంగ్రెస్ కూడా ఈ వర్గం మద్దతు పొందాలనే ప్రయత్నాలు తీవ్రంగానే చేస్తోంది. బ్రాహ్మణ వర్గంలో మంచి పట్టున్న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ తో పాటుగా ఇతర బ్రాహ్మణ నేతల సహకారంతో వారి ఓట్లను పొందే ప్రయత్నాలు చేస్తోంది. గతంలో తనకు మద్దతు పలికి ఇప్పుడు దూరం అయిన వీరి మద్దతు కూడగట్టుకోవాలని బీఎస్పీ కూడా ప్రయత్నిస్తోంది. ముస్లీం దహిత నినాదం అందుకున్న మాయావతి అటు బ్రాహ్మణులను కూడా ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ప్రస్తుత ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా వీరి మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ వర్గానికి వరాలను ప్రకటిస్తూ వారి మనసును గెల్చుకునే పనిలో పడ్డారు. మరి బ్రాహ్మణులు ఎవరికి మద్దతునిస్తారో వేచి చూడాల్సిందే.
 
For the upcoming assembly elections in Uttar Pradesh all parties are strategically working on the Brahmin votes this season. A determined campaign has been mounted to encash these Brahmin votes which round up to more than 10 percent of the total voters in Uttar Pradesh. As is evident that the elections in Uttar Pradesh are more of caste based where bulk voting as well as votes division biased on the caste of the candidate rather his capability or election campaigning.
Originally Brahmin voters supported congress but over a period of time with changes in political scenario these voters supported BJP and it is said hence the party came to power but again party could not upheld these votes and taking and Mayavati’s propaganda of unity of dalit and Brahmins worked out well in favour of her. But again unsatisfied Brahmin votes got divided in last elections.
In the present heat of elections all parties, including BJP,Congress ,BSP and the present chief minister Akhilesh Yadav are trying hard to win the hearts of Brahmins community with promises. But who will lead the race is yet to be watched.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *