చిరుకు అభినందనలు చెప్పిన రోజా

రాజకీయాల్లో ఎడమొహం పెడమొహంగా ఉన్న చిరంజీవి,రోజా ఒకే వేదికమీదికి వచ్చారు. చిరంజీవితో పాటుగా అనేక సినిమాల్లో నటించిన రోజా ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరూ రెండు పార్టీల్లో ఉండడంతో ఎప్పుడూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. చిరంజీవిపై రోజా కొన్ని సందర్భాల్లో తీవ్రంగా విమర్శించారు కూడా. తాజాగా చిరంజీవి 150వ సినిమా సందర్భంగా చిరంజీవికి రోజా అభినందనలు తెలిపారు. చిరు నటించిన సినిమా హిట్ కావాలని ఆకాంక్షించారు. టీవీ షోల్లో బిజాగా ఉన్న రాజా ఒక టీవీ ఛానల్ కోసం చిరంజీవిని ఇంటర్వ్యూ చేశారు. ఈ సినిమాలో చిరు చాలా చక్కగా నటించారని దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటుగా విరామం వచ్చినట్టుగా ఎక్కడా కనిపించలేదని అన్నారు. చిరంజీవి సినిమా సూపర్ హిట్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్టు రోజా చెప్పారు. తాను చిరంజీవితో నటించిన సినిమాలను గురించి గుర్తు చేసుకున్నారు.
 
Chiru and roja
Leadres of opposite political parties Chiranjeevi and Roja shared the same stage.after acting in many films together both of them started their political career too. Being in different parties both of them had a tug of war with their sharp comments on each other many a times.But this time Roja came up congratulating Chiranjeevi on his 150th movie release and wished himm all the success for ‘Kaidi No.150’. Remembering the days of working with Chiranjeevi she applauded him for his action in the latest film where she said she could not see any difference in his acting skills even after nine years gap in the film industry.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *