అన్నయ్య సినిమాకు రివ్యూలు అవసరం లేదు

తమ అభిమాన హీరో దాదాపు తొమ్మిది సంవత్సరాల తరువాత నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమాను చూపి మేగా అభిమానులు ఆనందడోలికల్లో మునిగి తేలుతున్నారు. మేగాస్టార్ ఈ చిత్రంలో చేసిన డ్యాన్స్ చూస్తే కుర్ర హీరోలకు కూడా మతిపోతుందని వారంటున్నారు.
mega-fans
స్టెప్పులతో అదరగొట్టిన చిరును చూపి అభిమానులు చిందులేస్తున్నారు. ఖైదీ సినిమా అద్భుతంగా ఉందని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి 150వ సినిమా తమ అంచానాలకు అనుగుణంగా ఉందని సినిమా సూపర్ హిట్ అంటున్నారు. సినిమా పై రకరకాల రివ్యూలు వస్తున్నాయని అయితే చిరంజీవి అభిమానులకు రివ్యూలతో పనిలదని అభిమానులు చెప్తున్నారు. చిరంజీవీ సినిమాను గురించి రివ్యూలు రాసే సత్తా ఎవరికీ లేదని అన్నయ్య అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. రివ్యూలలలో ఏముంది అని చూసుకుని తాము సినిమాకు వెళ్లడం లేదని చిరు 150 వ సినిమా వచ్చిందటేనే తమకు పండగలా ఉందని అంటున్నారు. ఎవరేం రాసుకున్నా ఎవరెన్ని మాటలు చెప్పినా తమ అభిమాన హీరో సినిమా సూపర్ హిట్ అని అభిమానులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి సినిమాలో తాము కోరుకున్న అన్ని అంశాలు ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చిరు సినిమా తమకు  మంచి పండగ భోజనం లాగా ఉందంటున్నారు.
 
Boss is back
After a gap of nine years all chiru fans are super excited and happy on his latest release’Kaaidi N0.150’. with wonderful reactions from them who say the dance of Chiranjeevi challenges the younger heroes. Happy with movie outcome fans are celebrating the new release in all joy as they say the movie was more than their expectations with wonderful dance steps. Fans say that their mega star do not need any reviews and for them they don’t matter at ll it seems.In this new year watching Chiranjeevi on silver screen is itself a gift to them is what fans have to say.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *