ధియేటర్లలో మేగా అభిమానుల సందడి

మేగాస్టార్ చిరంజీవి నటించిన 150 సినిమా ఖైదీ 150 విడుదల కావడంతో మోగా అభిమానుల్లో సందడి నెలకొంది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో మేగా అభిమానులు ధియేటర్లకు చేరుకున్నారు. “బాస్ ఈజ్ బ్యాక్” అంటూ నినాదాలు చేస్తూ ధియేటర్ల  దగ్గర మేగా అభిమానులు సందడి చేస్తున్నారు. మేగా స్టార్ నటించిన ఈ చిత్రాన్ని చూసేందుకు అభిమానులు బారు తీరారు. దాదాపు తొమ్మిది సంవత్సరాల తరువాత మేగాస్టార్ నటించిన చిత్రం విడుదల కావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఉదయం నుండే ధియేటర్లు అభిమానులతో కిక్కిరిసి పోయాయి. తమ అభిమాన నటుడిని వెంటితెరపై చూసేందుకు అభిమానులు భారీస్థాయిలో చేరుకున్నారు. తొమ్మిది సంవత్సరాలు విరామం తీసుకున్నప్పటికీ చిరంజీవి అదే స్థాయిలో నటించాడని పాటలు, ఫైట్లలో తన శైలిలో సత్తా చాటాడని అభిమానులు అంటున్నారు. చిరంజీవి అభిమానులకు రెండు రోజుల ముందే పండగ వచ్చిందని మేగా అభిమానులు అంటున్నారు. భారత్ తో పాటుగా పలు దేశాల్లో కూడా చిరంజీవి సినిమా విడుదల అయింది. విదేశాల్లో సైతం పెద్ద ఎత్తున మేగా అభిమానులు ప్రీమియర్ షోలకు హాజరవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *