ప్రయాణికుల రద్దీ-ప్రైవేటు బస్సుల దోపిడీ

సంక్రాంతి సందర్భంగా రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. పండుగకు ఇంకా ఐదు రోజులు ఉండగానే పెద్ద సంఖ్యలో సొంత ఊర్లకు బయలు దేరడంతో ఇప్పటి నుండే బస్సులు, రైళ్లు కిటకిటలాడుతున్నాయి. రైళ్లలో రిజర్వేషన్లు చాలా రోజులే క్రితమే అయిపోయాయి. దీనితో జనరల్ కంపార్ట్ మెంట్లలో జనం కిక్కిరిసి పోయి ప్రయాణిస్తున్నారు. మరి కొంత మంది రిజర్వేషన్ బోగిల్లోకి ఎక్కేస్తున్నారు. తెలంగా, ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు కూడా ప్రయాణికుల రద్దీని తట్టుకోలేకపోతున్నాయి. ప్రత్యేక బస్సులు కూడా సరిపోవడం లేదు. ఇటు ప్రైవేటు బస్సు సర్వీసులు మాత్రం ప్రయాణికులను దోచుకుంటున్నాయి. సాధారణ సీట్లకు అదనంగా క్యాబిన్ లలో ప్రత్యేక కుర్చీలు వేయించి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు. మరి కొందరిని దారిలో కూర్చో బెడుతున్నారు. సాధారణ సమయాల్లో ఉన్న టికెట్ ధరకు రెండు నుండి మూడు రెట్లు అదనంగా వసూలు చేస్తున్నారు. ఆర్టీఏ అధికారులు అడపాదడపా దాడును నిర్వహిస్తున్నా ప్రైవేటు బస్సు ఆపరేటర్లు  మాత్రం ఇష్టం వచ్చినట్టు రేట్ల పెంచుకుంటూ పోతున్నారు. ప్రతీ సంక్రాంతికీ హైదరాబాద్ నుండి పెద్ద సంఖ్యలో ఆంధ్రా ప్రాంతానికి ప్రజలు వెళ్తుంటారు. అయినా అటు రైల్వేశాఖ కానీ ఇటు ఆర్టీసీ కానీ ప్రయాణికుల రద్దీకి తగినట్టుగా ఏర్పాటు చేయకపోవడం ప్రైవేటు ఆపరేటర్లకు వరంగా మారింది.
 
Private bus operators loot
 
All those who planned a visit home this holiday season will need to shell more money for the bus fare as most of private bus operators have made a hike in the fares. With Sankranti festival in five days trains and buses are already full of passengers. With general boggies over loaded with passengers even reservation compartments are no less vacant. Telangana and AP RTC have launched special bus services for this festival season but is unable fulfill the requirement of people travelling to there respective home towns. Putting the safety of passangers at risk private bus operators are overloading the buses even with the rates two to three times higher than the normal charges. The lack of proper arrangements by state RTC and railways has become a boon to private bus operators who are looting normal public.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *