విమాన టికెట్ రు.899 కే

 
ఇటీవల వేయి రూపాయలకే విమాన టికెట్ అని ఎయిర్ ఇండియా ప్రకటించగా దానికి పోటీగా టాటా, సింగపూర్ ఎయిర్ లైన్స్ ల భాగస్వామ్య సంస్థ ఎయిర్ లైన్స్ విస్తారా 899 రూపాయలకే విమాన టికెట్ ను అందిస్తున్నట్టు ప్రకటించింది. సంస్థ రెండవ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఆఫర్ ను ప్రకటిస్తున్నట్టు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. విస్తారా వెబ్ సైట్ తో పాటుగా మొబైల్ యాప్ ల నుండి ఈ టికెట్ లను పొందవచ్చు. దీనితో పాటుగా టికెట్ ను బుక్ చేసుకున్న వారికి 500 రూపాయల విలువ చేసే గిఫ్ట్ ఓచర్ ను అందచేయనున్నారు. ఈ టికెట్లు 11,12వ తేదీల్లో అందుబాటులో ఉంటాయని సంస్థ పేర్కొంది. ప్రస్తుతం టికెట్ ను బుక్ చేసుకున్న వారు జనవరి 25వ తేదీ నుండి అక్టోబర్ 1వ తేదీ మధ్యలో ప్రయాణించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *