తయారీ రంగంలో భారత్ మరింత ముందుకు దూసుకని పోవాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గుజరాత్ లోని గాంధీనగర్ లో జరిగిన వైబ్రంట్ గుజరాత్ సదస్సులో మోడీ మాట్లాడారు. తయారీ రంగంలో భారత్ ప్రస్తుతం ఆరో స్థానంలో ఉందని అది మరింత ముందుకు దూసుకుని పోవాల్సిన అవసరం ఉందన్నారు. మేకిన్ ఇండియా కార్యక్రమానికి ప్రభుత్వం అన్నిరకాలుగా ప్రోత్సహకాలను ఇస్తోందన్నారు. దీని వల్లే భారత్ తయారీ రంగంలో దుసుకుని పోతోందని చెప్పారు. ప్రపంచం ఆర్థిక మందగమనంలో సాగుతున్నప్పటికీ భారత్ మంచి ఫలితాలను సాధిస్తోందని చెప్పారు. భారత్ వృద్ధి రేటు అద్భుతంగా ఉందని చెప్పారు. వాణిజ్యాన్ని సులభతరం చేశామని మోడీ చెప్పారు. పర్యాటక రంగానికి మరిన్ని ప్రోత్సహకాలు అందచేస్తున్నట్టు మోడీ తెలిపారు. ఈ రంగాన్ని మరింత అబివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న ఆర్థిక సంస్కరణలను మరింత ముందుకు తీసుకుని పోతామని చెప్పారు. ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడం కోసం తీసుకుని వచ్చిన సంస్కరణలు సత్పలితాలను ఇచ్చిందని చెప్పారు.