ఓ జవాను ఆవేదన

 


ఇది ఓ సైనికుడి ఆవేదన…ఆక్రోశం… అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో దేశ సరిహద్దుల్లో పనిచేస్తున్న సైనికులకు సరైన ఆహారం లభించడం లేదా…రోజుకు 11 గంటల పాటు పనిచేస్తున్నా తమకు సరైన ఆహారం లభించడం లేదంటూ  సరిహద్దు భద్రతా దళంలోని 29వ బెటాలియన్‌కు చెందిన తేజ్‌బహదూర్‌ యాదవ్‌ అనే జవాను తీసిన వీడియో వైరల్‌గా మారింది. ఆ జవాను తీసిన వీడియో ఇప్పుడు హచ్ చల్ సృష్టిస్తోంది. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దేశ సరిహద్దులను రక్షిస్తూ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా పనిచేస్తున్న మన సైనికులకు మనం చేస్తున్నది ఇంతేనా అంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తన్నారు. సదరు జవాను పోస్ట్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో రోజుకు 11 గంటల పాటు తాము పనిచేస్తున్నామని అయినా తమకు అందచేసే ఆహారం అత్యంత నాసిరకంగా ఉంటోందని సదరు జవాను తన వీడియోలో ఆరోపించాడు. తమకు ఇస్తున్న అల్పాహారంగా ఇస్తున్న రొట్టెల్లో కనీసం కూర ఉండడంలేదని కేవలం టీ తోనే చపాతీలను తింటున్నమని ఆ జవాన్ పేర్కొన్నాడు. భోజనం కూడా పూర్తి నాసిరకంగా ఉంటోందంటూ ఆవేదన చెందాడు. భారత ప్రభుత్వం తమ ఆహారానికి పెద్ద మొత్తంలో నిధులను మంజూరు చేస్తున్నప్పటికీ అంత మొత్తం తమ వద్దకు రావడం లేదని మధ్యలోనే అధికారులు నిధులను స్వాగా చేసి తమకు అరకొర ఆహారాన్ని అందచేస్తున్నరని జవాను వాపోయాడు.  సదరు జవాను పోస్టు చేసిన వీడియో విస్తృతంగా ప్రచారం కావడం తో బీఎస్ఎఫ్ అధికారులు రంగంలోకి దిగారు. ఈ వీడియోను పోస్ట్ చేసిన జవాను తేజ్ బహదూర్ యాదవ్ కు మధ్యం సేవించే అలవాటు ఉందని దీని వల్ల అతనికి రావాల్సిన పదోన్నతులు రాలేదనే అక్కసుతో అతను ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నాడని బీఎస్ఎఫ్ అధికారులు అంటున్నారు.
 
This is the agitation of a soldier…………. Under adverse circumstances at the border is our soldier depleted of proper food? This video went viral shared by a BSF jawan from29 betalion Mr.Tej Bahadur Yadav. The video is creating turbulence now with wide spread discussions. Working for 11 hours a day in adverse climatic conditions and yet no proper food is being  supplied is what he shared in his video. Responding the video BSF higher authorities denied the fact saying the jawan has the habit of boozing.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *