రాందేవ్ బాబా పై విషపు ప్రచారం

యోగా గురువు రాందేవ్ బాబా పై సామాజిక మాధ్యమాల్లో విషపు ప్రచారం ఎక్కువైంది. రాందేవ్ బాబా ప్రధాన ప్రచారకుడిగా ఉన్న పంతాజలి ఉత్పత్తులపై వ్యతిరేక ప్రచారంతో పాటుగా వ్యక్తిగతంగా రాందేవ్ బాబాను వ్యక్తిత్వాన్ని కించపర్చే విధంగా రాతలతో పోస్టులు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. రాందేవ్ బాబా చేతిలో విస్కీ గ్లాస్ తో ఉన్నట్టుగా ఉన్న ఫొటోతో పాటుగా బాబా మహిళలతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను పెట్టి వాటిపై అభ్యంతర రాస్తున్నారు. గతంలోనూ రాందేవ్ బాబా కు చెందిన ఇవే ఫొటోలు గతంలో సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగినా ప్రస్తుతం తిరిగి ఒక్కసారిగా ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
baba3 baba2 baba1
ఇటీవల కాలంలో రాందేవ్ బాబా ప్రధాన ప్రచార దారుడిగా ఉన్న పంతాంజలి ఉత్పత్తులు సంచలనం సృష్టిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఈ ఫొటోలను ఒక పథకం ప్రచారం చేస్తున్నారని బాబా సన్నిహితులు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా రాందేవ్ బాబాకు విస్తృతంగా వస్తున్న ప్రచారాన్ని చూసి ఓర్వలేకనే కొందరు పనిగట్టుకుని ఇటువంటి ప్రచారాలు చేస్తున్నారని రాందేవ్ బాబా అనుచరులు చెప్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు ఉన్న రాందేవ్ బాబా వద్దకు నిత్యం వేలాది మంది  వస్తుంటారని అటువంటి వారిలో అన్నిరాకాల వాళ్లు ఉంటారని దానిని తప్పుబట్టాల్సింది ఏమీలేదన్నారు. మార్ఫింఫ్ చేసిన ఫొటోలతో బాబా వ్యక్తిత్వాన్ని ఎవరూ దెబ్బతీయలేరని అన్నారు. బాబా రాందేవ్ పై తప్పుడు ప్రచారాన్ని చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాందేవ్ బాబా అనుచరులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *