ఇక్కడ పిడకలు అమ్మబడును

ఇదీ అదీ అనే తేడా లేకుండా అన్ని వస్తువులను ఆన్ లైన్ లో అమ్మకానికి పెడుతున్నారు. భోగి మంటల్లో వేసుకునే పిడకలు సైతం ఇప్పుడు ఆన్ లైన్ లో దర్శనమిస్తున్నాయి. పిడకలు కూడా ఆన్ లైన్ లో కొనుక్కోవాలా అని పెద్దలు సణుగుతుంటే ఏదైనా సౌకర్యంగా ఉంది కదా మహానగరాల్లో పిడకల వేట ఏంటీ అంటూ నేటి తరం అంటోంది. ప్రజలకు కావాల్సిన అన్ని రకాల వస్తువులను ఆన్ లైన్ లో పెడుతున్న సంస్థలు ఇప్పుడు ఏకంగా పిడకలను ఆన్ లైన్ లో పెడుతున్నాయి. ప్రముఖ ఆన్ లైన్ సంస్థ అమోజాన్ పిడకలను ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టింది. దీనిపై రకరకాల జోకులు ప్రచారం అవుతున్నాయి.
 
There is nothing that is not on sale online now a days. Yes ‘Cow dung cakes’(‘pidakalu’ in telugu) are now available online for various occasions like on ‘Bhogi’ festival. Though the older generation frown on the concept of online shopping for even cow dung cakes, young people are happy with the convenience of availability. With increase in online shopping for almost everything amazon has come up with even cow dung cakes. Now, of course wonderful jokes on this topic are ready for circulation with buy pidakalu online tag line.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *